ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | applications are invited for postal jobs | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

Mar 26 2017 3:09 PM | Updated on Sep 18 2018 8:18 PM

ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం - Sakshi

ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని కడప డివిజన్‌ పరిధిలో పలు పోస్టల్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పోస్టల్‌ సూపరింటెండ్‌ ఎ. శ్రీనివాసరావు తెలిపారు.

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: జిల్లాలోని కడప డివిజన్‌ పరిధిలో ఉన్న పోస్టల్‌లో గ్రామీణ డాక్‌ సేవక్‌లో మెయిల్‌ డెలివర్స్, క్యారియర్స్, ప్యాకర్స్‌ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పోస్టల్‌ సూపరింటెండ్‌ ఎ. శ్రీనివాసరావు తెలిపారు. 30 పోస్టులు ఉన్నట్లు చెప్పారు.  శనివారం పోస్టల్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు 10 వతరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు.   పదిలో మెరిట్‌ మార్కులను బట్టి ఎంపిక చేస్తామన్నారు.

కడప మండలంలోని రామాంజనేయపురం–ఓసీ, అలంఖాన్‌పల్లె ఓబీసీ,  నందలూరు మండలంలోని పొత్తపి ఓసీ, శేషామాంబపురం ఓబీసీ, పాటూరు ఓబీసీ, కోనాపురం ఓసీ, సిద్దవటం ఓసీ, కలసపాడు ఓసీ, బద్వేల్‌ మండలంలోని చెన్నంపల్లె ఓసీ, చిన్న కేశంపల్లె ఓబీసీ, ఓబులవారిపల్లె మండలంలోని ఓబుళవారిపల్లె ఓసీ పుల్లంపేట మండలంలోని టి,కమ్మపల్లె ఓబీసీ, రామసముద్రం ఓబీసీ, తిప్పాయపల్లె ఓసీ,  చిట్వేలి మండలంలోని  నాగవరం ఓసీ,  కంపసముద్రం ఓబీసీ,  రాజంపేట మండలంలోని తాళ్ళపాక ఓసీ, ఊటుకూరు ఓసీ, చిన్నమండెం ఓసి,పడమటి కోన ఓసీ,  కలిబండ ఓబీసీ, రాయచోటి  మండలంలోని  మాసాపేట బజార్‌ ఓసీ, మాధవరం ఓసీ,  సంబేపల్లె మండలంలోని సంబేపల్లె ఎస్టీ, మోటకట్ల ఎస్సీ, గుట్టపల్లె ఎస్సీ సుండుపల్లె మండలంలోని  బుడిదగుంట రాచపల్లె ఎస్సీ, గాలివీడు మండలంలోని పందిళ్ళపల్లె,  ఓసీ అదేవిధంగా రాజంపేట సబ్‌డివిజన్‌ పరిధిలోని సీకేఎన్‌పేట ఓబీసి, ఇంతిమాపురం ఓబీసీ, ఖాళీలు ఉన్నాయన్నారు. ఏప్రిల్‌ 18 లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement