
విదేశీ పోస్టల్ స్టాంపులపై బతుకమ్మ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ దేశాల్లో తెలంగాణకు మరో అరుదైన గౌరవం లభించింది. రాష్ట్ర బతుకు చిత్రాన్ని ఆవిష్కరించే బతుకమ్మ, తెలంగాణ ప్రాశస్త్యన్ని దశ దిశలా చాటుతున్న ఎంపీ కవిత ఒకే పోస్టల్ స్టాంప్‌పై కనిపించనున్నారు. న్యూజి లాండ్‌లో డాలర్ విలువ చేసే పోస్టల్ స్టాంప్‌తో పాటు లండన్‌లో ఫస్ట్ క్లాస్ స్టాంపును ఆయా దేశాలు విడుదల చేశాయి. ఈ రెండు దేశాల్లోని టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ బాధ్యులు ఆయా ప్రభుత్వాలతో మాట్లాడి కవిత పోస్టల్ స్టాంపును విడుదల చేశారు.
ఆస్ట్రేలి యా టీఆర్‌ఎస్ శాఖ అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి కాసర్ల, కార్యదర్శి అభినయ్ కనపర్తి, తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు రాజీవ్‌సాగర్, నగేశ్‌రెడ్డి, జమాల్, రోహిత్ రావు సోమవారం తెలంగాణ భవన్‌లో కవితను కలసి న్యూజిలాండ్, లండన్ పోస్టల్ స్టాంపులను అందజేశారు. వీటిపై తెలుగు లిపిలో బతుకమ్మ శుభాకాంక్షలు అని ఉండటంతోపాటు బతుకమ్మను ఎత్తుకున్న కవిత ఫొటో ప్రత్యేక ఆకర్షణగా ఉంది.