
'కామారెడ్డిని జిల్లాగా మారుస్తాం'
కామారెడ్డిని జిల్లాగా మారుస్తామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
కామారెడ్డి: కామారెడ్డిని జిల్లాగా మారుస్తామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో బుధవారం రాత్రి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ.. సర్కారు బడులను దశలవారీగా అభివృద్ధి చేస్తామన్నారు. బాల్య వివాహాలను నిర్మూలించాలని చెప్పారు.