ఉద్యోగుల సహకారంతోనే మొదటి స్థానం
– పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఉద్యోగుల సహకారంతోనే కర్నూలు డివిజన్‌కు రీజియన్ స్థాయిలో మొదటి స్థానం లభించిందని పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు పేర్కొన్నారు. శనివారం స్థానిక బి.క్యాంప్ పోస్టాఫీసులో హెడ్ మాస్టర్ సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో పోస్టల్ సూపరింటెండెంట్‌కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సూపరింటెండెంట్‌తో పాటు ఆయన సతీమణి రమాదేవిలను దుశ్శాలువలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు దంపతులకు కిరీటం ధరింపజేసి సభాస్థలి దాకా ఊరేగించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోస్టుమాస్టర్లు ఎద్దుల డేవిడ్, సూర్యనారాయణరావు, జయచంద్ర, శాంతకుమారి, ధూరతి, శివకుమార్‌రెడ్డి, తిక్కయ్య, సిస్టమ్ ఆర్గనైజర్స్ ఇంతియాజ్, రమేశ్ పాల్గొన్నారు.