
వంటావార్పులో పోస్టల్ ఉద్యోగులు
బోయినపల్లి : గ్రామీణ తపాల ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మండలకేంద్రం లోని సబ్ పోస్ట్ ఆఫీస్ ఎదుట శుక్రవారం తపాల ఉద్యోగులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపైనే కట్టెల పొయ్యితో వంటలు చేశారు. అనంతరం సామూహిక బోజనాలు చేశారు. ఈ సందర్భంగా తపాల ఉద్యోగులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే కమలేశ్ చంద్ర కమిటీ నివేదికను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నో ఏళ్లుగా చాలీ చాలని జీతంతో బతుకులీడుస్తున్న తమకు వేతన సవరణ చేసి, జీతాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఏఐజేడీఎస్‌యూ కార్యదర్శి క్రిష్ణ, బోయినపల్లి సబ్ పోస్టాఫీసు పరిధిలోని తడగొండ, విలాసాగర్, అనంతపల్లి, నూకలమర్రి, ఫాజుల్‌నగర్, వట్టెంల, నర్సింగాపూర్, కోరెం గ్రామాల బీపీఎంలు కట్ట కిరణ్, జయప్రకాశ్, శశి, తిరుపతి, మల్లేశం, ప్రభాకర్, వేణు, ఈడీఎంసీలు రాజేందర్, లచ్చయ్య, నాగభూషణం తదితరులున్నారు.