తపాలా ఉద్యోగుల ధర్నా
తపాలా ఉద్యోగుల ధర్నా
Published Fri, Oct 21 2016 1:42 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు (దర్గామిట్ట) : అఖిల భారత తపాలా సంఘం పిలుపుమేరకు పోస్టల్ యూనియన్లు (ఎన్‌ఎఫ్‌పీఈ, ఎఫ్‌ఎన్‌పీఓ, జీడీఎస్) నెల్లూరులోని ఆచారివీధిలో ఉన్న ప్రధాన తపాలా కార్యలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ తపాలా ఉద్యోగుల (జీడీఎస్) డివిజనల్ అధ్యఽక్షుడు ఎన్.పెంచలయ్య మాట్లాడతూ కంటింజెంట్, క్యాజువల్ వర్కర్లకు 2006 సంవత్సరం నుంచి అరియర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీడీఎస్ ఉద్యోగులను డిపార్టుమెంటు ఉద్యోగులుగా పరిగనించాలని, ఏడో వేతన కమిటీని వెంటనే అమలుచేయాలని కోరారు. నాయకులు ఏవీ కృష్ణయ్య మాట్లాడుతూ డిపార్టుమెంటులో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ నాయకులు సీహెచ్ వెంకయ్య, ఎన్.రామ్మూర్తి, తిరుపాలయ్య, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, జె.ఆంటోని ,రామారావు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
Advertisement