త్వరలో ప్రభుత్వ స్మార్ట్ స్కూళ్లు
సాక్షి, హైదరాబాద్: ఏసీ తరగతి గదులు, ఎల్‌సీడీ బోర్డులు... డిజిటల్ ప్రొజెక్టర్లు.. తదితర హంగులతో స్మార్ట్ స్కూల్స్‌ను ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వీలైతే ఈ విద్యా సంవత్సరంలోనే హైదరాబాద్‌లో తొలుత రెండు పాఠశాలలను స్మార్ట్ స్కూల్స్‌గా తీర్చిదిద్దాలని భావిస్తోంది. తరువాత విస్తరణపై ఆలోచనలు చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 2,150 స్కూళ్లలో డిజిటల్ తరగతులను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్న విద్యాశాఖ... ప్రభుత్వ రంగంలోనూ స్మార్ట్ స్కూల్స్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది.
బీడీఎస్ ఫస్టియర్ ఫలితాలు విడుదల
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జూలై/ఆగస్టులో నిర్వహించిన మొదటి సంవత్సరం బీడీఎస్ ఫలితాలను గురువారం విడుదల చేసింది. విద్యార్థులు తమ మార్కుల రీ-టోటలింగ్ కోసం ఈనెల 21వ తేదీలోగా సబ్జెక్టుకు రూ. 2 వేలు చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి తెలిపారు. ఫలితాలు యూనివర్సిటీ (హెచ్‌టీటీపీ://ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్) వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
11 నుంచి రెండోదశ మెడికల్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి ఈ నెల 11 నుంచి 14 వరకు రెండోవిడత కౌన్సెలింగ్ జరగనుంది. కూకట్‌పల్లిలోని జేఎన్టీయూహెచ్‌లో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. 73 ఎంబీబీఎస్, 117 బీడీఎస్ సీట్లను ఈ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు.
గ్రూప్స్ సిలబస్, ప్రిపరేషన్‌పై రేపు సదస్సు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్ సిలబస్, పరీక్షలకు ప్రిపరేషన్‌పై ఈనెల 12న అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు గ్రూప్-1 అధికారులు అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో ఉదయం 9 గంటలకు ఈ సదస్సు ఉంటుందని పేర్కొన్నారు. సదస్సుకు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, కమిషన్ సభ్యులు సి.విఠల్, చంద్రావతి, మతీనుద్దీన్‌ఖాద్రీ, సిలబస్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం తదితరులు పాల్గొంటారని వెల్లడించారు.
అక్టోబర్ 13 నుంచి పండిత శిక్షణ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పండిత శిక్షణ కోర్సుల విద్యార్థులకు అక్టోబర్ 13 నుంచి 17 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం గురువారం తెలిపింది. రోజూ ఉదయం, మధ్యాహ్నం ఎగ్జామ్స్ ఉంటాయని పేర్కొంది.
అక్టోబర్ 4న టీటీసీ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు లోయర్ గ్రేడ్ పరీక్షను వచ్చే నెల 4న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం గురువారం తెలిపింది. మే-జూన్‌లో నిర్వహించిన కోర్సులో ఫెయిలైన వారూ పరీక్షకు హాజరు కావచ్చని పేర్కొంది. వరంగల్, నిజమాబాద్, నల్లగొండ, హైదరాబాద్‌లో పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది. హాల్‌టికెట్లు నేరుగా పంపిస్తామని, అందని వారు ఠీఠీఠీ.ఛట్ఛ్ట్ఛ్చజ్చ్చ.ౌటజలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.
‘డిటెన్షన్’పై రేపే అఖిల పక్ష సమావేశం
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యలో డిటెన్షన్ విధానం తీసుకురావాలా.. నాన్ డిటెన్షన్ విధానాన్నే కొనసాగించాలా అన్న విషయంపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు సేకరించేందుకు ఈనెల 12న అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయించింది. సమావేశంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితోపాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొననున్నారు.
ఆర్కిటెక్చర్ కాలేజీలకు అనుమతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ఆర్కిటెక్చర్ కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరానికి ఆమోదం తెలుపుతూ విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్.ఆర్.ఆచార్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యాశాఖ విజిలెన్స్ ఆఫీసర్ నియామకం
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట పాఠశాల, ఉన్నత విద్యా విజిలెన్స్ అధికారిగా విద్యా జాయింట్ సెక్రటరీ విజయ్‌కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్.ఆర్.ఆచార్య గురువారం ఉత్తర్వులిచ్చారు.
ఎడ్యుకేషన్ & జాబ్స్
Published Fri, Sep 11 2015 3:04 AM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM
Advertisement
Advertisement