ఎడ్యుకేషన్ & జాబ్స్ | Education and jobs of the day | Sakshi
Sakshi News home page

ఎడ్యుకేషన్ & జాబ్స్

Published Mon, Sep 14 2015 2:00 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Education and jobs of the day

 -    ఏయూ అభ్యర్థులకు 2 బీడీఎస్ సీట్లు
 విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహిస్తున్న రెండో విడత తెలంగాణ మెడికల్ కౌన్సెలింగ్‌లో సోమవారం నాటి కౌన్సెలింగ్‌కు రెండు బీడీఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం క్యాంపు అధికారి డాక్టర్ టి.మురళీమోహన్ తెలిపారు. ఇవి కూడా ఏయూ ఏరియా అభ్యర్థులకు మాత్రమే. ఎస్టీ (జనరల్), ఎస్టీ (మహిళ)కు ఒక్కొక్కటి చొప్పున హైదరాబాద్ ప్రభుత్వ డెంటల్ కళాశాల (స్టేట్ వైడ్)లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం జరిగే కౌన్సెలింగ్‌కు ఎస్వీయూ, ఓయూ ఏరియా అభ్యర్థులు హాజరుకానవసరంలేదని క్యాంపు అధికారి తెలిపారు. సోమవారంతో కౌన్సెలింగ్ ముగియనుంది.
 
 -    అగ్రి డిగ్రీ కోర్సులకు తుది కౌన్సెలింగ్
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు తుది కౌన్సెలింగ్‌ను ఈ నెల 18, 19  తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఫ్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు తెలిపారు. 18న ఉదయం ఓపెన్  కేటగిరీ విద్యార్థులకు ఎంసెట్‌లో 1,140-6,000 ర్యాంకు, మధ్యాహ్నం రైతు కోటాలో 6,011-8,106 ర్యాంక్ వరకు రిజర్వ్‌డ్ సీట్లకు కౌన్సెలింగ్ జరగనుంది. 19న రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించి బీసీ-ఎ (6,828-13,591), బీసీ-బి (6,004-6,206), బీసీ-సి (6,048-12,130), బీసీ-డి (6,015-6,777), బీసీ-ఈ (6,154-10,474), ఎస్టీ (6,023-10,647), ఎస్సీ (6,395-13,671) కౌన్సెలింగ్ జరగనుంది. రైతు కోటాలో రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించి బీసీ-డి(8,121-8,662), బీసీ-ఈ(11,045-30,602), ఎస్టీ(10,741-12,458), ఎస్సీ(13,715-17,286) కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
 
 అదనంగా 30 పశువైద్య సీట్లు
 మొదటి కౌన్సెలింగ్‌లో అగ్రికల్చర్, హార్టీకల్చర్, వెటర్నరీ కోర్సుల్లో మిగిలి పోయిన మొత్తం 123 సీట్లతో పాటు ఈ కౌన్సెలింగ్‌లో పశువైద్య కోర్సులో అదనంగా మరో 30 సీట్లు చేర్చుతున్నట్లు పీవీ నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర పశువైద్య వర్సిటీ రిజిస్ట్రార్ కె.కొండల్‌రెడ్డి తెలిపారు. వీటిలో వర్సిటీ పరిధిలోని రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాలలో 15 సీట్లు, కరీంనగర్ జిల్లా కోరుట్ల వెటర్నరీ కళాశాలలో 15 సీట్లు ఉంటాయన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని వర్సిటీ అధికారులు సూచించారు
 
     అగ్రి కోర్సుల్లో 14న స్పాట్ కౌన్సెలింగ్
 హైదరాబాద్: అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం స్పాట్ కౌన్సెలింగ్‌ను ఈ నెల 14న నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రవీణ్‌రావు తెలిపారు. వ్యవసాయ వర్సిటీతో గుర్తింపు పొందిన ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో మిగిలి ఉన్న 180 అగ్రికల్చర్, 45 సీడ్ టెక్నాలజీ, 14 అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సీట్ల భ ర్తీకి 14వ తేదీ ఉదయం 9 గంటలకు వర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులే కౌన్సెలింగ్‌కు రావాలని ప్రవీణ్‌రావు సూచించారు.
 
     15 మంది ఉద్యోగులు ఏపీకి బదిలీ
 హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు  చెందిన 15 మంది ఉద్యోగులను వర్సిటీ ఆ ప్రాంతానికి బదిలీ చేసింది. వీరిలో వివిధ హోదాలకు చెందిన వారున్నారు. వారికి ఈ నెల 11న  నియామక పత్రాలను అందించారు. వారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ వర్సిటీలో సోమవారం రిపోర్టు చేయాలని సంబంధిత ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగులంతా వర్సిటీ పరిధిలోని రాజేంద్రనగర్, కరీంనగర్ జిల్లా కోరుట్ల వెటర్నరీ కళాశాలల్లో పనిచేస్తున్నారు. వారంతా తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించాలని దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఈ బదిలీలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement