శాయంపేట: పదిరోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నా తగ్గలేదు. దీంతో గ్రామస్తుల సూచన మేరకు భార్యతో కలిసి కరోనా పరీక్ష చేయించుకునేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. మధ్యాహ్నం తరువాత పరీక్షలు చేస్తామని సిబ్బంది చెప్పడంతో అప్పటికే నీరసంతో ఉన్న అతడు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని అలాగే మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా శాయంపేటలో శనివారం చోటుచేసుకుంది.
మండలంలోని రాజపల్లికి చెం దిన కొయ్యడ రాజమల్లు (45) కూలీ. ఆయనకు భార్య రజితతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పదిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన సర్పంచ్, ఏఎన్‌ఎం ఒత్తిడితో శనివారం ఉదయం భార్యతో కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. మధ్యాహ్నం కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తామని సిబ్బంది చెప్పారు. అప్పటికే నీరసంగా ఉన్న రాజమల్లు పక్కనే ఉన్న బల్లపై పడుకుని, కొంతసేపటికి మృతిచెందాడు. కాగా, మృతదేహానికి కరోనా పరీక్ష నిర్వహించగా నెగెటివ్‌గా వచ్చింది. ఆయన భార్యకు పాజిటివ్‌గా తేలింది.
( చదవండి: పదేళ్లకు చేరిన తల్లి.. దుఃఖాన్ని ఆపుకోలేక కుమారుడు )
Comments
Please login to add a commentAdd a comment