
ఐర్లాండ్‌తో జరిగే ఏకైక టెస్ట్, ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్ సిరీస్ సన్నాహాల కోసం ఐపీఎల్ టి20 టోర్నీ మొత్తం మ్యాచ్‌లు ఆడబోనని ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు. మార్చి 31 నుంచి మే 28 వరకు ఐపీఎల్ జరుగుతుంది. ఐర్లాండ్‌తో ఏకైక టెస్ట్ జూన్ 1 నుంచి, యాషెస్ సిరీస్ జూన్ 16 నుంచి జరుగుతాయి. గత రెండు ఐపీఎల్ సీజన్‌లకు దూరంగా ఉన్న స్టోక్స్‌ను గత డిసెంబర్‌లో చెన్నై జట్టు రూ. 16 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment