
హైదరాబాద్ లో బంగ్లాతో టెస్టు ఫిబ్రవరిలో
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో స్వదేశంలో భారత్ ఆడే టెస్టును వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేశారు. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు హైదరాబాద్‌లో జరుగుతుందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి ఈ ఏడాదే ఈ మ్యాచ్ జరగాల్సి ఉన్నా... భారత జట్టు బిజీ షెడ్యూల్ కారణంగా వాయిదా పడింది. భారత్‌లో బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్ ఆడనుండటం ఇదే తొలిసారి.