మాస్కో: యూరప్‌లో కాస్త చల్లారాయనుకుంటున్న యుద్ధ భయాలను, ఉద్రిక్తతలను రష్యా మళ్లీ పెంచేస్తోంది. తమ బలగాల సన్నద్ధతను, అణు, సంప్రదాయ ఆయుధాలను పరీక్షించుకునేందుకు శనివారం భారీ సాయుధ కసరత్తుకు దిగుతున్నట్టు రష్యా సైన్యం పేర్కొంది. అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగల ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లు, క్రూయిజ్ మిసైళ్లతో పాటు పూర్తిస్థాయి సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ జరిగే ఈ విన్యాసాలను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారని రక్షణ శాఖ పేర్కొంది.
యుద్ధమే జరిగితే వినాశనానికే దారితీస్తుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ శుక్రవారం హెచ్చరించారు. మరోవైపు నాటో సభ్య దేశాల రక్షణ మంత్రులు బ్రెసెల్స్‌లో సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు. రష్యాలో అమెరికా దౌత్యాధికారి బ్రాట్ గార్మన్‌ను రష్యా బహిష్కరించింది. తాము కూడా దీటుగా స్పందిస్తామని యూఎస్ చెప్పింది. తూర్పు ఉక్రెయిన్‌లో నానాటికీ పెరుగుతున్న కాల్పుల నేపథ్యంలో అక్కడి వేర్పాటువాద ప్రభుత్వం స్థానికులను రష్యాకు తరలిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment