
రోహిత్ శర్మ పునరాగమనం
ముంబై: శ్రీలంకతో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం సెలక్టర్లు ఆదివారం 16 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించారు. బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ టెస్టుల్లోకి పునరాగమనం చేశాడు. న్యూజిలాండ్‌తో ఇం డోర్‌లో ఆఖరి సారిగా టెస్టు మ్యాచ్ ఆడిన అతను... ఆ తర్వాత గాయం కారణంగా ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలతో జరిగిన టెస్టులకు దూరమయ్యాడు. ఇప్పటికే దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత ‘ఎ’ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేసిన నేపథ్యంలో సీనియర్ టీమ్ నుంచి కరుణ్ నాయర్ దూరమయ్యాడు. ఈ సిరీస్‌లో భాగంగా ఈ నెల 26 నుంచి గాలేలో తొలి టెస్టు జరుగుతుంది. జట్టు వివరాలు: కోహ్లి (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), విజయ్, రాహుల్, పుజారా, రోహిత్, అశ్విన్, జడేజా, సాహా, ఇషాంత్, ఉమేశ్, పాండ్యా, భువనేశ్వర్, షమీ, కుల్దీప్, ముకుంద్.