భారత్‌తో టెస్టుల్లో ఇదే మా తొలి లక్ష్యం
బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హసన్ వ్యాఖ్య
చెన్నైలో అడుగు పెట్టిన బంగ్లా బృందం
చెన్నై: భారత్‌తో రెండు టెస్టులు, ఆపై మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత గడ్డపై ఆదివారం అడుగు పెట్టింది. ఢాకా నుంచి ఆటగాళ్ల బృందం తొలి టెస్టు వేదిక అయిన చెన్నైకి నేరుగా చేరుకుంది. తమ దేశంలో అంతర్యుద్ధం కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్ సిరీస్ కోసం భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్ జట్టుకు సెక్యూరిటీ కల్పించే విషయంలో బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టింది.
టీమ్ బస చేస్తున్న హోటల్‌లో బోర్డు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసింది. సోమవారం నుంచి బంగ్లాదేశ్ జట్టు ప్రాక్టీస్ మొదలు పెడుతుంది. 19 నుంచి ఇరు జట్ల మధ్య ఎంఎ చిదంబరం స్టేడియంలో తొలి టెస్టు జరుగుతుంది. సీనియర్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ మినహా బంగ్లాదేశ్ ఆటగాళ్లంతా వచ్చారు.
ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కౌంటీలు ఆడుతున్న షకీబ్ టెస్టు సమయానికి నేరుగా చెన్నైకి చేరుకుంటాడు. భారత్‌కు బయల్దేరడానికి ముందు బంగ్లాదేశ్ కెప్టెన్నజు్మల్ హసన్ షంటో మీడియాతో మాట్లాడాడు. ‘పాకిస్తాన్‌పై సిరీస్ విజయంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. భారత్‌తో సిరీస్‌లో గట్టి పోటీ ఇవ్వగలం.
టెస్టు మ్యాచ్‌లలో కుప్పకూలిపోకుండా ఆటను ఐదు రోజుల వరకు తీసుకెళ్లడం మా తొలి లక్ష్యం. భారత్‌తో సిరీస్ మాకు సవాల్. అందరిలాగే మేమూ అన్ని మ్యాచ్‌లు గెలవాలనే కోరుకుంటాం. మా బలానికి తగినట్లుగా ఆడటం ముఖ్యం. మా అత్యుత్తమ ప్రదర్శన కూడా ఇవ్వాలి’ అని నజ్ముల్ చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment