ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి
ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి
Published Mon, Sep 19 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
మిర్యాలగూడ : పదో తరగతి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలని మానస వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. సోమవారం స్థానిక టీఎన్‌ఆర్ గార్డెన్స్‌లో ట్రస్మా ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఆవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతి«థిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఆత్మసై్తర్యం కోల్పోకుండా, భయం లేకుండా పరీక్షలకు హాజరు కావాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవాలన్నారు. భవిష్యత్‌లో ఎలా ఉండాలనే విషయాలపై దృష్టి పెట్టాలన్నారు. పాఠశాలలో చదివిన పాఠ్యాంశాలకు తోడుగా జనరల్ నాలెడ్జ్‌ని కూడా పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రస్మా జిల్లా నాయకులు వంగాల నిరంజన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కుందూరు శ్యాంసుందర్‌రెడ్డి, నాయకులు అల్గుబెల్లి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాసచారి, అయ్యన్న, ఓరుగంటి శ్యామ్, ఎజాజ్, సుధాకర్‌రెడ్డి, మల్సూర్, చార్లెస్, గిరి, నర్సిరెడ్డి, సలీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరేంద్రనాథ్‌ను ట్రస్మా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
Advertisement