Yandamuri
-
కష్టపడి కాదు ఇష్టపడి చదవాలి
కానూరు(పెనమలూరు) : విద్యార్థులు కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలుగుతారని ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ తెలిపారు. కానూరులోని పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో మంగళవారం వ్యక్తిత్వ వికాసంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కోపం, అసూయ, బద్దకం, అతి నిద్ర, అతిగా ఆహారం తీసుకోవటం, అమర్యాదగా ప్రవర్తించటం ఉండరాదన్నారు. వారంలో ఆరు రోజులు జీవితం కోసం తినాలని, ఏడో రోజు మాత్రం తమకు ఇష్టమైంది తినాలని సూచించారు. పోటీతత్వం లేకపోతే రాణించలేరని, కోపాన్ని అదుపులో ఉంచుకుని క్రమశిక్షణతో ఉండాలని అన్నారు. ఐశ్వర్యారాయ్ కావాలంటే అదృష్టం ఉండాలని, మదర్‌థెరిసా కావాలంటే మనస్సు ఉంటే సరిపోతుందని వివరించారు. కార్యక్రమంలో కాలేజీ కన్వీనర్ బోయపాటి శ్రీరాములు, కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శివాజీబాబు, ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పద్మనాభరాజు, అధ్యాపకురాలు రుద్రమదేవి తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి
మిర్యాలగూడ : పదో తరగతి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలని మానస వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. సోమవారం స్థానిక టీఎన్ఆర్ గార్డెన్స్‌లో ట్రస్మా ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఆవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతి«థిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఆత్మసై్తర్యం కోల్పోకుండా, భయం లేకుండా పరీక్షలకు హాజరు కావాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవాలన్నారు. భవిష్యత్‌లో ఎలా ఉండాలనే విషయాలపై దృష్టి పెట్టాలన్నారు. పాఠశాలలో చదివిన పాఠ్యాంశాలకు తోడుగా జనరల్ నాలెడ్జ్‌ని కూడా పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రస్మా జిల్లా నాయకులు వంగాల నిరంజన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కుందూరు శ్యాంసుందర్‌రెడ్డి, నాయకులు అల్గుబెల్లి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాసచారి, అయ్యన్న, ఓరుగంటి శ్యామ్, ఎజాజ్, సుధాకర్‌రెడ్డి, మల్సూర్, చార్లెస్, గిరి, నర్సిరెడ్డి, సలీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరేంద్రనాథ్‌ను ట్రస్మా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. -
వ్యసనాలకు దూరంగా ఉండాలి
బోట్‌క్లబ్ (కాకినాడ) : వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, సాహిత్య అవార్డు గ్రహీత, నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ విద్యార్థులకు ఉద్బోధించారు. స్థానిక విద్యుత్‌నగర్‌లో శ్యామ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో సోమవారం ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు హాజరవుతున్న విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చదువుకొనేటప్పుడు మంచి వాతావరణం ఎంతో అవసరమని యండమూరి పేర్కొన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నెల్లాల్ల ముందు నుంచి ఎటువంటి మాంసాహారం తీసుకోకుండా ఉంటే మంచిదన్నారు. పరీక్షకు వెళ్లేటప్పుడు నేను తప్పకుండా ఈ పరీక్షలో పాసవుతానన్న దృఢసంకల్పంతో ఉండాలని సూచించారు. పరీక్ష హాల్లో ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే సమాధానలు రాయడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. ఒక్కసారి ప్రశ్నపత్రాన్ని క్షుణ్ణంగా చదువుకొని ఆ తర్వాత ఆలోచించుకొని జవాబులు రాయాలన్నారు. ప్రస్తుతం విద్యార్థులు సెల్‌ఫోన్‌తో ఎక్కువ సేపు కాలక్షేపం చేస్తున్నారని, పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో దానికి దూరంగా ఉండాలన్నారు. శ్యామ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ గుంటూరు శ్యామ్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకొని పరీక్షలు సక్రమంగా రాసి ఉద్యోగాలు సాధించాలని కోరారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
శాన్వి హత్యకేసులో రఘునందన్‌కు మరణ శిక్ష
-
బద్ధకం వదలండి
యువతకు తనికెళ్ల భరణి పిలుపు యండమూరి నాకు పెద్ద శత్రువు. నాటకంలో, రచనలో ఆయనతో నేను నిత్యం పోటీ పడేవాడిని. ఒక విధంగా చెప్పాలంటే అతనిపై కక్షతోనే నేను రచయితనయ్యాను. చివరకు యండమూరి దర్శకత్వంలో వచ్చిన చిత్రానికి కొన్ని డైలాగులు రాసే అవకాశం కలిగింది. ఈరోజు అతని పుస్తకాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఏయూ క్యాంపస్: యువత బద్ధకం వీడి కార్యోన్ము ఖులు కావాలని ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం ఏయూ లో జరిగిన యండమూరి వీరేంద్రనాథ్ ‘లోయ లోంచి శిఖరానికి..’ పుస్తకావిష్కరణ సభలో ఆయన ప్రసంగించా రు. భరణి మాటల తూటాలు... ఇటు తల్లి దండ్రులను, అటు విద్యార్థులను ఆలోచింపజేశాయి. మేలుకొలుపు నేను తప్ప మా ఇంటిలో అందరూ గోల్డ్ మెడలిస్ట్లే. కళాశాల చదువు అయిపోయాక తెలుసుకున్నాను నేను బాగా చదవలేదని. ‘ఆలస్యంగా లేచి పైకొచ్చిన వాడిని నేను చూడలేదు’ అనే కొటేషన్ నన్ను ఎంతగానో మార్చివేసింది. ఉదయాన్నే నిద్ర లేవడాన్ని అలవాటుగా చేసుకుంటే ఎంతో సమయం మనకు కలసి వస్తుంది. దయచేసి దీనిని ఆచరించి చూడండి. గీతాసారం వ్యక్తిత్వ వికాస కేంద్రం భగవద్గీత అరవయ్యో ఏట చదవాల్సిన గ్రంథమనుకోవడం పొరపాటు. ఇది కచ్చితంగా 16వ ఏట పఠించాల్సినది. మన భారతీయ హైందవ మూలం నుంచి ఉద్భవించిన భగవద్గీత ఎన్నో వ్యక్తిత్వ వికాస సూత్రాలకు కేంద్రంగా నిలుస్తుంది. ఎవరో కాలం చేసినపుడు వినాల్సినదిగా భావించడం ఎంతమాత్రం భావ్యం కాదు. అమ్మా నాన్నలను మరవొద్దు తల్లిదండ్రులు పిల్లలతో స్నేహితులుగా మెలగాలి. మగ, ఆడ పిల్లలను సమానంగా చూడాలి. వివక్ష ఉండటం సరికాదు. ప్రొడక్టివ్‌గా, యూజ్‌ఫుల్‌గా బతకడానికి ప్రయత్నించండి. పదో తరగతి వరకు చెప్పులు లేకుండానే తిరిగాను. మధ్యతరగతి కుటుంబ కష్టాలు బాగా తెలిసిన వాడిని. అమ్మా అన్నం తిన్నావా అని ఒక్క రోజు అడగండి చాలు. వేరొకరికి పెట్టడానికి పుట్టిందే అమ్మ అనే విషయం మరువకండి. మన కోసం రాత్రింబవళ్లు పనిచేసే నాన్న కష్టం తెలుసుకుని చదివి ఉన్నతంగా రాణించండి.