పోలీసులకు ఆరోగ్య పరీక్షలు
– జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ
కర్నూలు: నెలాఖరులోగా పోలీసులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని ఎస్పీ ఆకె రవికృష్ణ హామీ ఇచ్చారు. శుక్రవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో సివిల్, ఏఆర్ సిబ్బంది నిర్వహించిన పరేడ్‌ను పరిశీలించారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. హోంగార్డు స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రతి రోజూ వ్యాయామం చేయాలని సూచించారు. అనారోగ్య కారణాలతో పోలీసులు సిబ్బంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుళ్లకు ఫిట్‌నెస్ కోర్సుల కోసం ఇప్పటికే కార్యచరణ ప్రారంభించినట్లు తెలిపారు. పోలీసు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. భద్రత రుణ సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు. డీఎస్పీ ఎ. రామచంద్ర, ఆర్‌ఐ రంగముని, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు పరేడ్‌లో పాల్గొన్నారు.