పదేళ్ల తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్టు | Test against South Africa after ten years | Sakshi
Sakshi News home page

పదేళ్ల తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్టు

Published Sat, May 4 2024 3:51 AM | Last Updated on Sat, May 4 2024 3:51 AM

Test against South Africa after ten years

వచ్చే నెలలో భారత్‌లో దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్‌ జట్టు పర్యటన

వన్డే, టి20 సిరీస్‌లు కూడా ఆడనున్న సఫారీ బృందం

 బెంగళూరు: భారత్‌లో దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్‌ జట్టు పర్యటన ఖరారైంది. వచ్చే జూన్, జూలైలో పూర్థిసాయి ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా భారత్‌తో దక్షిణాఫ్రికా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడుతుంది.  ముందుగా  బెంగళూరులో జూన్‌ 16న వన్డే సిరీస్‌ మొదలవుతుంది. 19న రెండో వన్డే, 23న మూడో వన్డేతో 50 ఓవర్ల ఫార్మాట్‌ ముగుస్తుంది.  వన్డే సిరీస్‌ ముగిశాక ఏకైక టెస్టు పోరు జూన్‌ 28 నుంచి చెన్నైలో జరుగుతుంది. 

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇది కేవలం మూడో టెస్టు కానుంది. దక్షిణాఫ్రికాలోని పార్ల్‌ వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్టు 2002లో... భారత్‌లోని మైసూరు వేదికగా రెండో టెస్టు 2014లో జరిగాయి. ఆ తర్వాత ఈ రెండు జట్లు టెస్టు ఫార్మాట్‌లో మరో మ్యాచ్‌ ఆడలేదు. దక్షిణాఫ్రికాతో ఆడిన రెండు టెస్టుల్లోనూ భారతే నెగ్గింది. ఏకైక టెస్టు ముగిశాక బెంగళూరులో ఈ రెండు జట్ల మధ్య జూలై 5, 7, 9 తేదీల్లో మూడు టి20ల సిరీస్‌ జరుగుతుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement