
215 పరుగులకు భారత్ ఆలౌట్
నాగ్‌పూర్: దక్షిణాఫ్రికాతో బుధవారమిక్కడ జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 215 పరుగులకు ఆలౌటైంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 పరుగుల వరకు వికెట్లు కోల్పోకుండా ధాటిగా ఆడుతున్నట్టు కనిపించింది. కానీ ధావన్ వికెట్ కోల్పోయిన అనంతరం వరుసగా వికెట్లను కోల్పోతూ 215 పరుగుకే ఆలౌటైంది. మురళీ విజయ్(40), జడేజా(34),సాహా(32) పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున టాప్ స్కోరర్లు గా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హార్మర్ 4, మోర్కెల్ 3 వికెట్లు పడగొట్టారు.