
ముంబై : బాలీవుడ్ గ్రీక్‌గాడ్ హృతిక్ రోషన్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌ల కాంబోలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన వార్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వార్ శనివారం రూ 11.80 కోట్లు రాబట్టి రూ 257 కోట్ల మార్క్‌ను అధిగమించింది. ఇక ఆదివారం సెలవు దినం కావడంతో ఈ మూవీ భారీ వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో 4000 స్క్రీన్‌లలో వార్ రిలీజైంది. హృతిక్, టైగర్‌లతో పాటు ఈ మూవీలో వాణీకపూర్ తన అందాలతో ఆకట్టుకోగా, అశుతోష్ రాణా, అనుప్రియ గోయెంకా ఇతర పాత్రల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment