
హీరో హృతిక్ రోషన్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ (2014), ‘వార్’ (2019) చిత్రాలు సూపర్‌హిట్టయ్యాయి. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లోనే ‘ఫైటర్’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని 2024 జనవరి 25న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే ‘వార్’ సినిమాకు సీక్వెల్‌గా రానున్న ‘వార్ 2’ ప్రస్తావన బాలీవుడ్‌లో మరోసారి తెరపైకి వచ్చింది.
‘వార్’ చిత్ర నిర్మాత ఆదిత్యా చోప్రా ‘వార్ 2’ ని వీలైనంత త్వరగా సెట్స్‌పైకి తీసుకువెళ్లాలనుకుంటున్నారట. దీంతో ‘ఫైటర్’ తర్వాత హృతిక్ రోషన్ చేయబోయేది ‘వార్ 2’ అని, ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్. ఈ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే ‘క్రిష్ 4’పై హృతిక్ ఫోకస్ పెడతారని బాలీవుడ్ టాక్. అయితే ‘వార్’ ని తెరకెక్కించిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలోనే ‘వార్ 2’ వస్తుందా? రాదా? అనే విషయంపై త్వరలో ఓ స్పష్టత రానుందని బాలీవుడ్‌లో వినికిడి.
Comments
Please login to add a commentAdd a comment