
నితిన్, రష్మికల డ్యాన్స్‌పై బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ స్పందించారు. ‘స్వీట్, నితిన్, రష్మికలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ‘భీష్మ’ టీంకు ఆల్ ది బెస్ట్. లవ్ యూ గాయ్స్’ అంటూ హృతిక్ ట్వీట్ చేశాడు. ఇంతకీ సంగతేంటంటే.. రీసెంట్‌గా బాలీవుడ్‌ను షేక్ చేసిన వార్ సినిమాలోని 'గుంగ్రూ' పాటకు నితిన్, రష్మికలు డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ పర్ఫార్మెన్స్ హృతిక్ రోషన్‌కు అంకితమంటూ రష్మిక పేర్కొన్నారు. ఈ వీడియోను వీక్షించిన అనంతరం హృతిక్ పై విధంగా కామెంట్ చేశారు.
ఇక నితిన్, రష్మిక హీరోహీరోయిన్‌లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భీష్మ’. పాటలు మినహా షూటింగ్ దాదాపుగా పూర్తయిందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. పాటల షూటింగ్ కోసం ‘భీష్మ’ రోమ్ నగరానికి వెళ్లింది. ఇక్కడ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రెండు పాటలను చిత్రీకరించబోతున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా షూటింగ్ గ్యాప్‌లో నితిన్, రష్మికలతో డిఫరెంట్ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోలకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
Sweet. Thank you so much Rashmika & Nithiin. Best wishes for #Bheeshma! Love you guys :) https://t.co/twzubWSuWQ
— Hrithik Roshan (@iHrithik) December 28, 2019
కాగా, ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ సాంగ్ సినీ ప్రేమికులను తెగ ఆకట్టుకుంటోంది. ‘హై క్లాస్ నుంచి లోక్లాస్ దాకా నా క్రష్ లులే.. వందల్లో ఉన్నారులే.. ఒకళ్లూ సెట్టవ్వలేదు’అంటూ సాగే ‘భీష్మ’ఫస్ట్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో తెగ ట్రెంట్ అవుతోంది. అంతేకాకుండా ఇప్పటివరకు 1.5 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇక శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది.
చదవండి:
తమన్నా వచ్చేది ‘మైండ్ బ్లాక్’లో కాదు
నితిన్, రష్మికల డ్యాన్స్.. అతడికి అంకితం
Comments
Please login to add a commentAdd a comment