సూర్య 'కంగువా' సినిమా ప్రేక్షకులు ముందుకొచ్చేసింది. అయితే రిలీజ్‌కి కొన్నాళ్ల ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.. ఈ మూవీ ఏకంగా రూ.2000 కోట్ల కలెక్షన్స్ సాధిస్తోందని, డౌట్ లేదంటూ చాలా పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చారు. అప్పట్లోనే ఈ మాటలు కాస్త ఓవర్‌గా అనిపించాయనే కామెంట్స్ వినిపించాయి. మరి 'కంగువ' ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? 2000 కోట్లు వసూళ్లు అయ్యే పనేనా?
కోలీవుడ్ 'బాహుబలి' అని చెప్పి 'కంగువా' సినిమాని ప్రచారం చేశారు. ట్రైలర్ చూస్తే వర్కౌట్ అయ్యే కంటెంట్ అనే చాలామంది అనుకున్నారు. కానీ రియాలిటీలో చాలా డిఫరెన్స్ ఉంది. టీమ్ అంతా కష్టపడ్డారు గానీ కథ, స్క్రీన్ ప్లే విషయంలో తీసికట్టుగా వ్యవహరించారు. ప్రస్తుత జనరేషన్ సూర్యకి సంబంధించిన 20-25 నిమిషాల ఎపిసోడ్ సినిమా మొదటలో ఉంటుంది. ఇదైతే మరీ చిరాకు పుట్టేంచేలా ఉంటుంది.
(ఇదీ చదవండి: Kanguva Review: 'కంగువా' మూవీ రివ్యూ)
పీరియాడిక సెటప్‌లో ఉంటే సూర్య గెటప్ బాగానే ఉంది. కానీ ఆ సీన్లు మరీ సాగదీతగా, ఆడియెన్స్‌కి కనెక్ట్ కాని విధంగా ఉన్నాయి. స్క్రీన్‌పై యుద్ధాలు జరుగుతుంటాయి. యాక్షన్ జరుగుతూ ఉంటుంది. కానీ ప్రేక్షకులకు పెద్దగా ఫీలవరు. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. వీకెండ్ వరకు అంటే ఏదోలా మేనేజ్ అయిపోతుంది గానీ ఆ తర్వాత మాత్రం ఆడియెన్స్ థియేటర్లకు వచ్చే దానిబట్టి ఉంటుంది.
సూర్య 'కంగువా' చిత్రానికి తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా కలిపి రూ.50 కోట్ల లోపే గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇలానే తక్కువ నంబర్స్ వస్తే రూ.2000 కోట్లు కాదు కదా.. లాంగ్ రన్ లో రూ.1000 కోట్లు రావడం కూడా కష్టమే! ఇప్పటికే తెలుగులో ఈ మార్క్ చేరుకున్న సినిమాలు బోలెడున్నాయి. తమిళ ఇండస్ట్రీ మాత్రం రూ.1000 కోట్ల వసూళ్ల కోసం మరికొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదేమో?
(ఇదీ చదవండి: సూర్య 'కంగువా' ఏ ఓటీటీకి రానుందంటే?)
Comments
Please login to add a commentAdd a comment