పేటీఎం ద్వారా పీవీఆర్ సినిమా టికెట్లు | Paytm partners with PVR, invests Rs 120 crore in online movie ticket market | Sakshi
Sakshi News home page

పేటీఎం ద్వారా పీవీఆర్ సినిమా టికెట్లు

Published Tue, Mar 22 2016 12:58 AM | Last Updated on Thu, Aug 9 2018 7:20 PM

పేటీఎం ద్వారా పీవీఆర్ సినిమా టికెట్లు - Sakshi

పేటీఎం ద్వారా పీవీఆర్ సినిమా టికెట్లు

రెండు సంస్థల మధ్య ఒప్పందం
న్యూఢిల్లీ: పీవీఆర్ సినిమా టికెట్లను ఇక నుంచి పేటీఎం ప్లాట్‌ఫార్మ్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు ఈ రెండు సంస్థలు సోమవారం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. తొలి ఏడాదిలో పేటీఎం ప్లాట్‌ఫార్మ్ ద్వారా రూ.250-300 కోట్ల విలువైన టికెట్లను విక్రయించాలని పీవీఆర్ యోచిస్తోంది. వినియోగదారుల దైనందిన జీవితాలకు సంబంధించి అన్ని రంగాల్లోకి విస్తరించాలన్న వ్యూహాంలో భాగంగా తాజాగా సినిమా టికెట్ల విక్రయంలోకి ప్రవేశిస్తున్నామని పేటీఎం తెలిపింది.తమకు 12.5 కోట్ల మంది నమోదిత వినియోగదారులున్నారని, నెలకు 9 కోట్ల ఆర్డర్లను తీసుకుంటున్నామని పేటీఎం వ్యవస్థాకులు, సీఈఓ కూడా అయిన్ విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. భారత్ మూవీ టికెటింగ్ మార్కెట్ 200 కోట్ల డాలర్లని, ప్రతి ఏడాది 10 శాతం చొప్పున వృద్ధి సాధిస్తోందని తెలిపారు. అయితే ఆన్‌లైన్ టికెట్ మార్కెట్ వాటా 15 శాతమేనని, ఏడాదిలో దీనిని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement