బ్రేక్‌ ఈవెన్‌ను క్రాస్‌ చేసిన ‘అశ్వథ్థామ’ | Naga Shaurya Aswathama Movie All Areas Break Even In 5 Days | Sakshi
Sakshi News home page

ప్రపంచ వ్యాప్తంగా రూ 13.65 కోట్ల గ్రాస్‌ వసూలు

Published Wed, Feb 5 2020 4:50 PM | Last Updated on Wed, Feb 5 2020 4:59 PM

Naga Shaurya Aswathama Movie All Areas Break Even In 5 Days - Sakshi

అమ్మాయిల ఫాలోయింగ్‌ ఉన్న యంగ్‌ హీరో నాగ శౌర్య నటించిన తాజా చిత్రం అశ్వథ్థామ. ఇప్పటి వరకు లవర్‌ బాయ్‌గా కనిపించిన నాగ శౌర్య ఈ సినిమాతో యాక్షన్‌ అవతారం ఎత్తారు. రమణ తేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ సొంతంగా కథ రాసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్‌, ఎమోషనల్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలో మెహరీన్‌ శౌర్యకి జోడిగా నటించింది. జనవరి 31 న విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనతో ముందుకు కొనసాగుతోంది. (‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ)

సంక్రాంతి సీజన్‌లో వచ్చిన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాల హమా మెల్లగా తగ్గుతుండటం.. అశ్వథ్థామ కలెక్షన్స్‌కు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. నాగశౌర్య నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేయడంతో ఈ సినిమా స్థిరమైన కలెక్షన్లు రాబడుతోంది. నిన్నటి వరకు రూ. 10 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి  బ్రేక్‌ ఈవెన్‌కు చేరువగా నిలవగా.. తాజాగా అందిన రిపోర్ట్స్‌ ప్రకారం రిలీజ్‌ అయిన అయిదు రోజుల్లోనే అన్ని ప్రాంతాల్లో బ్రేక్‌ ఈవెన్‌ క్రాస్‌ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద రూ. 13.65 కోట్లను రాబట్టి బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement