Break Even
-
'బేబీ' కలెక్షన్స్.. మూడో రోజుకే అన్ని కోట్ల లాభాలతో!
Baby Movie Collection: 'బేబీ' అస్సలు తగ్గట్లేదు. బాక్సాఫీస్ దగ్గర చిన్న సినిమాగా విడుదలైనప్పటికీ మాస్ ర్యాంపేజ్ చూపిస్తోంది. సాధారణంగా తక్కువ బడ్జెట్ సినిమాలకు ఎంత మంచి టాక్ వచ్చినా సరే పెట్టుబడి రిట్నర్ అయి, బ్రేక్ ఈవెన్ కావడానికి తక్కువలో తక్కువ వారమైనా పడుతుంది. కానీ ఈ మూవీ మాత్రం జస్ట్ మూడు రోజుల్లోనే ఫ్రాఫిట్ జోన్ లోకి వెళ్లిపోయింది. ఇప్పుడిదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ట్రాయాంగిల్ లవ్ స్టోరీతో తీసిన 'బేబీ'లో మెయిన్ హైలెట్ పాటలు. కథ ఇప్పటి జనరేషన్ కి రిలేట్ అయినప్పటికీ.. అద్భుతమైన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. దీనికి తోడు లీడ్ రోల్స్ యాక్టింగ్ మేజర్ ప్లస్ పాయింట్ అయింది. బూతులు, శృంగార సన్నివేశాలు కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ అవేవి కలెక్షన్లని అడ్డుకోలేకపోతున్నాయి. (ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ 'బేబీ' హవా నడుస్తోంది. దీంతో మూడు రోజుల్లోనే వరల్డ్‌వైడ్ రూ.23.5 కోట్ల గ్రాస్ సాధించినట్లు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు. అలానే అన్నిచోట్ల బ్రేక్ ఈవెన్ అయినట్లు ప్రకటించారు. దీనిబట్టి చూస్తే.. ఇకపై వచ్చే వసూళ్లంతా కూడా లాభాల కింద లెక్క. 'బేబీ' మూవీని రూ.7 కోట్లు పెట్టి తీశారనే సమాచారం. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ బట్టి చూస్తే లాంగ్ రన్ లో రూ.40-50 కోట్ల వరకు గ్రాస్ వసూలయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం నిర్మాతలకు పెట్టుబడి మీద 2-3 రెట్లు లాభాలు రావడం గ్యారంటీ. బేబీ మూడు రోజుల కలెక్షన్స్ నైజాం 8,56,50,706 వైజాగ్ 2,82,56,239 ఈస్ట్ 1,38,06,945 వెస్ట్ 83,00,334 కృష్ణా 1,33,22,572 గుంటూరు 1,08,04,046 నెల్లూరు 69,56,210 సీడెడ్ 2,09,11,880 కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా 77,93,808 ఓవర్సీస్ 3,94,00,000 మొత్తం 23,52,02,740 CULT BLOCKSBUSTER #BabyTheMovie proves it yet again that content is the king 👑 Breakeven in all areas with 23.5 Crores and racing into profit zone in just 3 days 💥 Experience the #CultBlockbusterBaby https://t.co/W41DguZjiF pic.twitter.com/IuY5kImUnN — Ramesh Bala (@rameshlaus) July 17, 2023 (ఇదీ చదవండి: ఆ న్యూస్ చూసి చాలా బాధపడ్డాను: సుస్మిత కొణిదెల) -
'పక్కా కమర్షియల్'గా హిట్టు.. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ మార్కు !
Gopichand Pakka Commercial 1St Week Collections: మ్యాచో హీరో గోపీచంద్, విలక్షణ దర్శకుడు మారుతి కాంబినేషన్లో వచ్చిన 'పక్కా కమర్షియల్' సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు కలెక్షన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇందులో గోపీచంద్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. రాశీ ఖన్నా క్యారెక్టర్ అద్భుతంగా డిజైన్ చేసాడు మారుతి. ఈ సినిమా కోసం పబ్లిసిటీతో కలుపుకొని దాదాపు రూ. 35 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు నిర్మాతలు. అందులో 32 కోట్లు కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ (డిజిటల్, శాటిలైట్, హిందీ రీమేక్, డబ్బింగ్ అన్ని) రూపంలోనే వచ్చాయి. ఇక సినిమాను చాలా చోట్ల ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. అందుకే ఇంత త్వరగా బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకుంది 'పక్కా కమర్షియల్' సినిమా. ఇంత ప్లానింగ్ ఉంటుంది కాబట్టే మారుతి మోస్ట్ బ్యాంకబుల్ డైరెక్టర్ అయ్యాడు. మొదటి రోజు రూ. 6.3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. ఆ తర్వాత రెండు రోజులు బాగానే క్యాష్ చేసుకుంది. ఓవరాల్‌గా 'పక్కా కమర్షియల్' మూడు రోజుల్లోనే సేఫ్ అయిపోయింది. చదవండి: మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం హీరో విశాల్‌కు మరోసారి గాయాలు.. షూటింగ్ నిలిపివేత.. #PakkaCommercial collects over 𝟏𝟓.𝟐 𝐂𝐑 Worldwide in 3 Days! 🔥💥 This Week, catch the ACTION - FUN Family Entertainer at cinemas near you! 🤩 🎟️: https://t.co/BcOUguIiyK @YoursGopichand @DirectorMaruthi @RaashiiKhanna_ #BunnyVas @SKNonline @UV_Creations @adityamusic pic.twitter.com/vQpCrMOUQd — GA2 Pictures (@GA2Official) July 4, 2022 -
రూ.3,000 కోట్ల టర్నోవర్ దిశగా డిజిట్ ఇన్సూరెన్స్
ముంబై: ఆన్లైన్ సాధారణ బీమా సంస్థ ‘డిజిట్ ఇన్సూరెన్స్’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే లాభ, నష్టాల్లేని స్థితికి చేరుకుంటుందని కంపెనీ చైర్మన్ కామేష్‌గోయల్ తెలిపారు. కెనడాకు చెందిన ఎన్ఆర్ఐ బిలియనీర్ ప్రేమ్‌వత్సకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ ఈ కంపెనీ ప్రమోటర్‌గా ఉంది. ఇప్పటికే 140 మిలియన్ డాలర్ల నిధులను (రూ.1,036 కోట్లు) డిజిట్లో ఇన్వెస్ట్ చేసింది. బెంగళూరు కేంద్రంగా 2017 డిసెంబర్లో కార్యకలాపాలు ప్రారంభించిన డిజిట్ ఇన్సూరెన్స్‌లో ఏ91 పార్ట్నర్స్, ఫేరింగ్ క్యాపిటల్, టీవీఎస్ క్యాపిటల్ కూడా పెట్టుబడులు పెట్టాయి. డిజిట్ ఇన్సూరెన్స్ రెండో ఏడాది (2019–20) రూ.2,252 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసిందని, 2018–19లో వచ్చిన రూ.1,205 కోట్ల ఆదాయంతో పోలిస్తే దాదాపు87 శాతం పెరిగిందని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,000 కోట్ల టర్నోవర్ మార్క్‌ను అధిగమిస్తామని కామేష్ గోయల్ వివరించారు. ప్రమోటర్లు ఇప్పటి వరకు రూ.1,650 కోట్ల నిధులను సమకూర్చారని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి సాధనకు అదనపు నిధుల అవసరం లేదన్నారు. ఆగస్ట్ నెలలో మోటారు ఇన్సూరెన్స్ పాలసీల విక్రయాల్లో 87 శాతం వృద్ధి నమోదయ్యిందని తెలిపారు. కానీ, పరిశ్రమ వృద్ధి ఒక శాతంగానే ఉందన్నారు. తమ మోటారు, హెల్త్‌పాలసీలకు మంచి డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. ఇదే ధోరణి కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్వల్ప లాభం నమోదు చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలిపారు. తొలి ఏడాది కార్యకలాపాలపై తాము రూ.425 కోట్ల నష్టాన్ని నమోదు చేసినట్టు ఆయన చెప్పారు. మోటారు ఇన్సూరెన్స్‌లో తమకు 2.6 శాతం వాటా ఉందని, మొత్తం మీద సాధారణ బీమాలో 1.54 శాతం వాటా జూన్ చివరి నాటికి ఉన్నట్టు కామేష్‌గోయల్ వెల్లడించారు. -
బ్రేక్ ఈవెన్‌ను క్రాస్ చేసిన ‘అశ్వథ్థామ’
అమ్మాయిల ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో నాగ శౌర్య నటించిన తాజా చిత్రం అశ్వథ్థామ. ఇప్పటి వరకు లవర్ బాయ్‌గా కనిపించిన నాగ శౌర్య ఈ సినిమాతో యాక్షన్ అవతారం ఎత్తారు. రమణ తేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ సొంతంగా కథ రాసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్, ఎమోషనల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలో మెహరీన్ శౌర్యకి జోడిగా నటించింది. జనవరి 31 న విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనతో ముందుకు కొనసాగుతోంది. (‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ) సంక్రాంతి సీజన్లో వచ్చిన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాల హమా మెల్లగా తగ్గుతుండటం.. అశ్వథ్థామ కలెక్షన్స్‌కు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. నాగశౌర్య నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేయడంతో ఈ సినిమా స్థిరమైన కలెక్షన్లు రాబడుతోంది. నిన్నటి వరకు రూ. 10 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బ్రేక్ ఈవెన్‌కు చేరువగా నిలవగా.. తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం రిలీజ్ అయిన అయిదు రోజుల్లోనే అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 13.65 కోట్లను రాబట్టి బ్లాక్బాస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. -
స్పైస్‌జెట్‌లో మళ్లీ అజయ్ ప్రయాణం
వాటా విక్రయించి దిగిపోతున్న మారన్ డీల్ విలువ దాదాపు రూ.1,500 కోట్లు వచ్చే ఏడాదికి బ్రేక్ ఈవెన్ సాధించేలా ప్రణాళిక కొన్ని విమానాలు, ఉద్యోగాల్లో సైతం కోత పెట్టుబడుల కోసం విదేశీ ఇన్వెస్టర్లతో చర్చలు న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌లోకి మళ్లీ పాత ప్రమోటర్ అజయ్‌సింగ్ ప్రవేశించారు. దాదాపు రూ.1,500 కోట్ల పెట్టుబడితో ప్రస్తుతం కళానిధి మారన్ నేతృత్వంలోని సన్ గ్రూపునకు ఉన్న వాటాలు మొత్తాన్ని కొనుగోలు చేయడానికి అజయ్ నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా డీల్ పూర్తి కావచ్చని సమాచారం. అయితే ఈ ఒప్పందానికింకా నియంత్రణ సంస్థలు అనుమతివ్వాల్సి ఉంది. తాను పెట్టుబడి పెట్టడంతో పాటు విదేశీ ఇన్వెస్టర్లతో పెట్టుబడులు పెట్టించి, సంస్థకు కొత్త ఊపిర్లూదేందుకు అజయ్ సింగ్ అయిదేళ్ల ప్రణాళికను సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తోంది. స్పైస్‌జెట్ బోర్డు ఆమోదించిన పునరుద్ధరణ స్కీమ్ ప్రకారం ప్రస్తుత ప్రమోటర్ కళానిధి మారన్ కుటుంబం, కాల్ ఎయిర్వేస్ యాజమాన్య, నియంత్రణ బాధ్యతలన్నీ సింగ్‌కు బదిలీ అవుతాయి. మారన్ కుటుంబం తమకున్న మొత్తం ఈక్విటీ వాటాలను ఆయనకు బదలాయిస్తుంది. అయితే మున్ముందు తమ వద్దనున్న వారంట్లను వాటాలుగా మార్చుకుని, 10 శాతం వాటాలతో మైనారిటీ ఇన్వెస్టరుగా మాత్రం కొనసాగుతుంది. గతేడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసిక గణాంకాల ప్రకారం మారన్ కుటుంబానికి 53.48 శాతం వాటాలు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక... యాజమాన్య బదలాయింపు, పునరుద్ధరణ ప్రణాళికను పౌర విమానయాన శాఖకు సమర్పించినట్లు అజయ్ సింగ్ తెలిపారు. కంపెనీ ఆర్థిక పరిస్థితిని, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపర్చేలా దీన్ని రూపొందించామన్నారు. బంబార్డియర్ క్యూ400 విమానాలను దశల వారీగా పక్కనపెట్టడం కూడా ఈ ప్లాన్‌లో భాగమే. దీనికి ఆమోదముద్ర లభించాక అమల్లోకి తెస్తారు. ప్రస్తుతం 41 బోయింగ్-14 బొంబార్డియర్ విమానాలతో కార్యకలాపాలు ఒక మోస్తరుగా నడుస్తున్నాయని.. క్రమంగా ఫ్లయిట్ సర్వీసులు పెంచడంపై దృష్టి పెడతామని సింగ్ చెప్పారు. స్పైస్‌జెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా లాభదాయకం కాని రూట్లతో పాటు కొన్ని ఉద్యోగాల్లో కూడా కోత విధించాల్సి రావచ్చని తెలిపారు. ప్రస్తుతం స్పైస్‌జెట్‌లో 5,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ జేపీ మోర్గాన్‌తో కూడా ఇన్వెస్ట్మెంట్ కోసం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 2005లో ఏర్పాటయ్యాక స్పైస్‌జెట్ యాజమాన్యం మారడం ఇది మూడోసారి. 2005లో ప్రవాస భారతీయుడు కన్సాగ్రా కుటుంబంతో కలిసి సింగ్ స్పైస్‌జెట్‌ను ఆరంభించాక అమెరికాకు చెందిన ఇన్వెస్టర్ విల్బర్ రాస్ మెజారిటీ వాటాలు కొన్నారు. 2010లో ఆ వాటాలను మీడియా దిగ్గజం సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుటుంబానికి విక్రయించారు. మారన్ స్పైస్‌జెట్‌లో దాదాపు రూ. 1,300 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇందులో సగ భాగాన్ని కంపెనీ కొనుగోలు కోసం వెచ్చించారు. తాజాగా మారన్ కుటుంబం నిష్ర్కమిస్తుండటంతో.. వ్యవస్థాపక ప్రమోటర్ సింగ్ మరోసారి కంపెనీ పగ్గాలు చేపట్టనున్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో స్పైస్‌జెట్ నష్టాలు రూ. 246 కోట్లు.