Baby (2023) Telugu Movie Day 3 Box Office Collection Worldwide - Sakshi
Sakshi News home page

Baby Day 3 Collection: 'బేబీ' ధమాకా.. వీకెండ్‌కే బ్రేక్ ఈవెన్

Published Mon, Jul 17 2023 3:06 PM | Last Updated on Mon, Jul 17 2023 3:23 PM

Baby Movie Day 3 Collection Worldwide - Sakshi

Baby Movie Collection: 'బేబీ' అస్సలు తగ్గట్లేదు. బాక్సాఫీస్ దగ్గర చిన్న సినిమాగా విడుదలైనప్పటికీ మాస్ ర్యాంపేజ్ చూపిస్తోంది. సాధారణంగా తక్కువ బడ్జెట్ సినిమాలకు ఎంత మంచి టాక్ వచ్చినా సరే పెట్టుబడి రిట్నర్ అయి, బ్రేక్ ఈవెన్ కావడానికి తక్కువలో తక్కువ వారమైనా పడుతుంది. కానీ ఈ మూవీ మాత్రం జస్ట్ మూడు రోజుల్లోనే ఫ్రాఫిట్ జోన్ లోకి వెళ్లిపోయింది. ఇప్పుడిదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

ట్రాయాంగిల్ లవ్ స్టోరీతో తీసిన 'బేబీ'లో మెయిన్ హైలెట్ పాటలు. కథ ఇప్పటి జనరేషన్ కి రిలేట్ అయినప్పటికీ.. అద్భుతమైన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. దీనికి తోడు లీడ్ రోల్స్ యాక్టింగ్ మేజర్ ప్లస్ పాయింట్ అయింది. బూతులు, శృంగార సన్నివేశాలు కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ అవేవి కలెక్షన్లని అడ్డుకోలేకపోతున్నాయి.

(ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)

ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ 'బేబీ' హవా నడుస్తోంది. దీంతో మూడు రోజుల్లోనే వరల్డ్‌వైడ్ రూ.23.5 కోట్ల గ్రాస్ సాధించినట్లు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు. అలానే అన్నిచోట్ల బ్రేక్ ఈవెన్ అయినట్లు ప్రకటించారు. దీనిబట్టి చూస్తే.. ఇకపై వచ్చే వసూళ్లంతా కూడా లాభాల కింద లెక్క.

'బేబీ' మూవీని రూ.7 కోట్లు పెట్టి తీశారనే సమాచారం. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ బట్టి చూస్తే లాంగ్ రన్ లో రూ.40-50 కోట్ల వరకు గ్రాస్ వసూలయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం నిర్మాతలకు పెట్టుబడి మీద 2-3 రెట్లు లాభాలు రావడం గ్యారంటీ.

బేబీ మూడు రోజుల కలెక్షన్స్

నైజాం       8,56,50,706
వైజాగ్        2,82,56,239
ఈస్ట్            1,38,06,945
వెస్ట్            83,00,334
కృష్ణా     1,33,22,572
గుంటూరు      1,08,04,046
నెల్లూరు      69,56,210
సీడెడ్      2,09,11,880
కర‍్ణాటక+రెస్టాఫ్ ఇండియా     77,93,808
ఓవర్సీస్       3,94,00,000

మొత్తం    23,52,02,740

(ఇదీ చదవండి: ఆ న్యూస్ చూసి చాలా బాధపడ్డాను: సుస్మిత కొణిదెల)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement