![Puri Jagannadh Launches Ashwathama Trailer - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/23/naga-shautya1.gif.webp?itok=HY4uin-x)
ఓ ప్రేమ కథ.. లేదంటే, రెండు వర్గాల మధ్య గొడవలు.. ఎప్పుడూ ఇదే కథేనా అనుకునే వారికి రొటీన్ కథతో కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ముందుకు వస్తున్నాడు హీరో నాగశౌర్య. అతను తాజాగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు పూరీ జగన్నాధ్ గురువారం సాయంత్రం రిలీజ్ చేశారు. సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ట్రైలర్ ప్రకారం అమ్మాయిల మిస్సింగ్‌తోపాటు, వారిని దారుణంగా చంపుతున్న వారికోసం హీరో వేట మొదలు పెడతాడు. అయితే వీళ్లందరినీ ఆడిస్తున్న ప్రధాన సూత్రధారిని పట్టుకోడానికి హీరో తన ప్రయత్నాలు కొనసాగిస్తాడు. (అశ్వథ్థామ టీజర్)
ఈ క్రమంలో నాగశౌర్య ఫైట్లు కూడా చేస్తాడు. అయితే శౌర్య లవర్‌బాయ్ ఇమేజ్ నుంచి ఒక్కసారిగా మాస్ యాంగిల్‌లో కనిపించడం కాస్త కొత్తగా ఉన్నా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక ట్రైలర్ చివరలో శౌర్య విజిల్ వేసుకుంటూ కనిపించే సీన్ అభిమానులతో ఈల వేయించేట్లు కనిపిస్తోంది. బీజీఎమ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘ఎటువైపు వెళ్లినా మూసుకుపోతున్న దారులు.. ఒకరితో ఒకరికి సంబంధంలేని వ్యక్తులు... వేట కుక్కల్లా వెంటపడే జాలర్లు.. శకునిలాంటి ఓ ముసలోడు.. వీరందరినీ ఒకే స్టేజ్ మీద ఆడించే ఆ సూత్రధారి ఎవరు?’ వంటి డైలాగ్స్ బాగున్నాయి. నాగశౌర్య ఈ సినిమాతో తప్పకుండా హిట్ ట్రాక్‌లోకి వస్తాడని అభిమానులు మక్తకంఠంతో చెప్తున్నారు. ఇక శౌర్య ఈ సినిమా పేరుని తన ఛాతిపై పచ్చబొట్టుగా పొడిపించుకున్న విషయం తెలిసిందే. కాగా సమాజంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా నాగశౌర్య సొంతంగా కథ రాసుకున్నాడు. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment