దర్శకురాలిగా ‘లక్ష్మీ సౌజన్య’ | Naga Shourya New Telugu Movie Shooting Launched | Sakshi
Sakshi News home page

దర్శకురాలిగా ‘లక్ష్మీ సౌజన్య’

Published Thu, Feb 13 2020 4:10 PM | Last Updated on Thu, Feb 13 2020 4:10 PM

Naga Shourya New Telugu Movie Shooting Launched - Sakshi

గ్యాప్‌ తర్వాత ‘అశ్వథ్థామ’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న యంగ్‌ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో వేగం పెంచాడు. నాగశౌర్య, ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ రీతు వర్మ జంటగా ఓ సినిమా ప్రారంభమైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై చిత్ర యూనిట్‌కు బెస్ట్‌ విషెస్‌ తెలియజేశారు. 

రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల19 నుంచి ప్రారంభంకానుంది. చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశి తెలిపారు. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి వంశి పచ్చి పులుసు సినిమాటోగ్రపీ అందిస్తున్నారు. ఇక ఛలో​ తర్వాత అంతటి హిట్‌ అందుకోని నాగశౌర్య ‘అశ్వథ్థామ’ వంటి మంచి కంటెంట్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు నాగశౌర్యనే కథను అందించడం విశేషం. సొంత బ్యానర్‌ ఐరా క్రియేషన్స్‌పై నాగశౌర్య తల్లి ఉష మూల్పురి ఈ చిత్రాన్ని నిర్మించారు. డిఫరెంట్‌ కాన్పెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక రీతు వర్మ కూడా పెళ్లి చూపులు తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు. అయితే ఈ సినిమాలో రీతువర్మ క్యారెక్టర్‌ స్పెషల్‌గా ఉంటుందని దర్శక నిర్మాతలు పేర్కొంటున్నారు.

చదవండి:
‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ
'చావుకబురు చల్లగా’ చెప్పిన కార్తికేయ

   

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement