నెట్టింట్లో దూసుకుపోతున్న ‘అశ్వథ్థామ’ టీజర్‌ | Naga Shauryas Ashwathama Telugu Movie Teaser Viral In Social Media | Sakshi
Sakshi News home page

నెట్టింట్లో దూసుకుపోతున్న ‘అశ్వథ్థామ’ టీజర్‌

Published Sat, Dec 28 2019 2:44 PM | Last Updated on Sat, Dec 28 2019 2:47 PM

Naga Shauryas Ashwathama Telugu Movie Teaser Viral In Social Media - Sakshi

రమణ తేజని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ నాగశౌర్య, మెహరీన్‌ జంటగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించారు. ఇప్పటివరకు క్లాస్‌ అండ్‌ లవర్‌బాయ్‌గా ముద్ర పడిన నాగశౌర్య ఈ చిత్రంతో ఆ ఇమేజ్‌ను చెరిపేసుకునే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌, సాంగ్స్‌తో సినిమాపై పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది. ముఖ్యంగా ఈ టీజర్‌ మాస్‌ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్‌ అయింది. 

దీంతో అశ్వథ్థామ టీజర్‌ నెట్టింట్లో తెగ వైరలవుతోంది. కేవలం 24 గంటల్లోనే 4 మిలియన్‌కు పైగా డిజిటల్‌ వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ టీజర్‌ సరికొత్త ఘనతను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం యూట్యూబ్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది. టీజర్‌, సాంగ్స్‌కు వస్తున్న రెస్పాన్స్‌తో చిత్రం ఘనవిజయం సాధించడం ఖాయమని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాకు కథను నాగ శౌర్యనే అందించిన విషయం తెలిసిందే. శ్రీచరణ్‌ పాకాల సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రం జనవరి 31న విడుదలకానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement