సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'గుంటూరు కారం' సినిమా బాక్సాఫీస్ దగ్గర తడబడుతోంది. తొలిరోజే ఆహా అనే రేంజులో కలెక్షన్స్ రాగా.. రెండో రోజుకి భారీగా డ్రాప్ కనిపించింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అలానే రాబోయే రోజుల్లో మరింతగా తగ్గే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ చిత్రానికి ఇలా జరగడానికి కారణాలేంటి? రెండో రోజుల్లో మహేశ్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందనేది ఇప్పుడు చూద్దాం.
మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడో సినిమా 'గుంటూరు కారం'. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు చాలా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ షూటింగ్ వాయిదా పడటం, హీరోయిన్ పూజాహెగ్డే, సినిమాటోగ్రాఫర్ తప్పుకోవడం లాంటివి అభిమానులకు సందేహాలు రేకెత్తించాయి. అయినా సరే త్రివిక్రమ్ మీద అందరూ నమ్మకం పెట్టుకున్నారు. కానీ తాజాగా రిలీజైన ఈ సినిమాకు మొట్టమొదటి షో నుంచే మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ప్రేక్షకుల ముందువెనక అయ్యారు.
(ఇదీ చదవండి: సంక్రాంతి మూవీస్.. ఈమె నటిస్తే హిట్ కొట్టడం గ్యారంటీనా?)
అయితే అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల 'గుంటూరు కారం' సినిమాకు తొలిరోజు ఏకంగా రూ 94 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలే ప్రకటించారు. రెండో రోజుకి వచ్చేసరికి రూ.127 కోట్ల వసూళ్లు వచ్చినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే రెండో రోజు కేవలం రూ 33 కోట్ల వచ్చినట్లే అనమాట. అంటే ఫస్ట్ డే వచ్చిన మొత్తంతో పోలిస్తే ఇది మూడో వంతు.
'గుంటూరు కారం' కలెక్షన్స్ తగ్గడానికి కారణాలు చూసుకుంటే.. దీనితోపాటే రిలీజైన 'హను-మాన్' హిట్ టాక్ తెచ్చుకోవడం, అలానే 'సైంధవ్', 'నా సామి రంగ' సినిమాలతో థియేటర్ల పంచుకోవడం కూడా వసూళ్ల తగ్గుదలకు కారణాలుగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు కథలోనూ కొత్తదనం లేకపోవడం మహేశ్ సినిమాకి దెబ్బేసినట్లు అభిమానులు మాట్లాడుకుంటున్నారు. సో అదన్నమాట విషయం.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆ తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే)
రమణగాడి 𝗦𝗨𝗣𝗘𝗥 𝗦𝗔𝗡𝗞𝗥𝗔𝗡𝗧𝗛𝗜 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥 💥#GunturKaaram grosses over 𝟏𝟐𝟕 𝐂𝐑 𝐆𝐫𝐨𝐬𝐬 in 2 Days Worldwide 🔥
— Haarika & Hassine Creations (@haarikahassine) January 14, 2024
ఈ భోగికి మీలో ఉన్న Egos & Haterd కాల్చేస్తారు అని ఆశిస్తూ, మీ అందరికి భోగి శుభాకాంక్షలు ✨
Watch the #BlockbusterGunturKaaram at cinemas… pic.twitter.com/1OvKeHnM36
Comments
Please login to add a commentAdd a comment