'బాహుబలి' గాయాలు | bahubali fans attacked on lb nagar theatre | Sakshi
Sakshi News home page

'బాహుబలి' గాయాలు

Jul 11 2015 1:25 AM | Updated on Aug 11 2018 8:27 PM

'బాహుబలి' గాయాలు - Sakshi

'బాహుబలి' గాయాలు

మొదటి రోజే సినిమా చూడాలన్న అభిమానుల అత్యుత్సాహం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది.

హైదరాబాద్: మొదటి రోజే సినిమా చూడాలన్న అభిమానుల అత్యుత్సాహం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. టిక్కెట్ల కోసం అభిమానులు చూపిస్తున్న అసహనం సమస్యలకు దారి తీస్తోంది. అటు ధియేటర్ యాజమాన్యాలు కూడా ఎక్కువ రేట్లకు టిక్కెట్లను ముందుగానే అమ్మేయడంతో అభిమానుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తోంది. టికెట్లు విక్రయించకపోవటంతో హైదరాబాద్ ఎల్బీనగర్ విజయలక్ష్మి థియేటర్పై అభిమానులు దాడి చేశారు. థియేటర్ అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు, ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి.

వరంగల్ జిల్లా మహబూబాబాద్లో బాహుబలి సినిమా టికెట్ల కోసం అభిమానులు బారులు తీరారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకోవటంతో పోలీసులు రంగంలోకి దిగారు. అభిమానులపై లాఠీఛార్జ్ చేశారు. దాంతో ఆగ్రహం చెందిన అభిమానులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement