డార్లింగ్ ప్రభాస్ 'సలార్' సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ప్రస్తుతం రూ.600 కోట్లకు చేరువలో ఉన్న ఈ చిత్రం.. లాంగ్ రన్‌లో మరో రూ.100 కోట్లు దక్కించుకునే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. అయితే ఓ చోట మాత్రం 'సలార్' కంటే ఓ ప్రాంతీయ సినిమా ఎక్కువ కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్‌గా మారిపోయింది.
'సలార్' సినిమాని తీసింది డైరెక్టర్ ప్రశాంత్ నీల్. 'కేజీఎఫ్' సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. ప్రభాస్‌తో మాస్ సినిమా తీశాడు. అయితే ఇది 2014లో తన తీసిన ఫస్ట్ మూవీ 'ఉగ్రమ్'కి రీమేక్ అని సరిగ్గా రిలీజ్‌కి ఓ రోజు ముందు చెప్పాడు. మిగతా భాషా ప్రేక్షకులు 'ఉగ్రమ్' చూడలేదు కానీ కన్నడ ఆడియెన్స్ చాలాసార్లు చూసేశారు.
(ఇదీ చదవండి: 'మంగళవారం' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో విషాదం)
ఈ క్రమంలోనే కర్ణాటకలో 'సలార్' వసూళ్లు ఓ మాదిరిగానే వచ్చాయి. ఇప్పటివరకు రూ.35.7 కోట్ల కలెక్షన్స్ మాత్రమే సాధించినట్లు తెలుస్తోంది. అదే టైంలో రీసెంట్‌గా డిసెంబరు 29న కన్నడ స్టార్ హీరో దర్శన్ 'కాటేరా' రిలీజైంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో రెండు రోజుల్లోనే రూ.37 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
మిగతా చోట్ల 'సలార్' వసూళ్ల మేనియా గట్టిగా ఉన్నప్పటికీ కన్నడలో మాత్రం పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోయింది. ఈ కారణంగానే 'కాటేరా'కు ప్లస్ అయింది. అలా కాకుంటే మాత్రం ప్రభాస్ సినిమా ముందు దర్శన్ అస్సలు నిలబడలేకపోయేవాడు.
(ఇదీ చదవండి: 'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment