
డైనోసర్ దెబ్బకు బాక్సాఫీస్ కుదేలైపోతోంది. 'సలార్' వసూళ్ల సునామీ దెబ్బ గట్టిగానే తగిలింది. డార్లింగ్ ప్రభాస్ అయితే చాలారోజుల తర్వాత రచ్చరచ్చ చేస్తున్నాడు. ఇంతలా ఎందుకు చెబుతున్నామంటే.. 'సలార్' మూవీకి వీకెండ్‌లో అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. ఏకంగా రూ.400 కోట్ల మార్క్ కూడా క్రాస్ చేసిపడేసింది. ఇంతకీ ఓవరాల్ వసూళ్లు ఎంత?
(ఇదీ చదవండి: 'సలార్' మేకింగ్ వీడియో.. ఆ సీన్స్ ఇలా తీశారా?)
ప్రభాస్ కటౌట్‌కి తగ్గ మాస్ సినిమా పడి చాన్నాళ్లయిపోయింది. 'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ.. 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్'.. అనుకున్నంత రేంజులో ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడు అవన్నీ మర్చిపోయేలా 'సలార్' చేస్తోంది. ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకోగా.. అందుకు తగ్గట్లే కలెక్షన్స్ కూడా దుమ్మురేపుతున్నాయి.
తొలిరోజు రూ.178.7 కోట్లు రాగా.. రెండో రోజుకి ఇది రూ.295.7 కోట్లు అయ్యాయి. మూడు రోజులు పూర్తయ్యేసరికి రూ.402 కోట్లు వచ్చినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ వీకెండ్‌లోనే 400 కోట్ల మార్క్ దాటిపోయిందంటే.. రెండో వీకెండ్ అయ్యేసరికి రూ.1000 కోట్ల మార్క్ క్రాస్ కావడం గ్యారంటీ అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?)
𝑩𝑶𝑿 𝑶𝑭𝑭𝑰𝑪𝑬 𝑲𝑨 𝑺𝑨𝑳𝑨𝑨𝑹 🔥#BlockbusterSalaar hits 𝟒𝟎𝟐 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐁𝐎𝐂 (worldwide) 𝐢𝐧 𝟑 𝐃𝐚𝐲𝐬!#RecordBreakingSalaar #SalaarRulingBoxOffice#Salaar #SalaarCeaseFire #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms… pic.twitter.com/C8rFGeSs86
— Salaar (@SalaarTheSaga) December 25, 2023