
బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా.. రూ.4 వేల కోట్ల కలెక్షన్స్.. ఏదో తెలుసా?

బాహుబలి-1, బాహుబలి-2 సూపర్ హిట్!

కేజీఎఫ్, ఆర్‌ఆర్‌ఆర్.. ఆస్కార్ లెవెల్ హిట్!

కల్కి.. దేవర బంపర్ హిట్!

ఒక్కోటి వందల కోట్ల రూపాయల కలెక‌్షన్స్ సాధించాయి!

కానీ.. భారతీయ సినిమా చరిత్రలో హైయ్యెస్ట్ కలెక‌్షన్స్ కొట్టేసిన సినిమా ఏదో మీకు తెలుసా?

చెబితే ఆశ్చర్యపోతారు. అక్షరాలా నాలుగు వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన సినిమా..మొఘల్.. ఏ.. ఆజమ్!

అదేంటి? ఎప్పుడో 1960లో రిలీజైన సినిమా... వేల కోట్ల కలెక‌్షన్స్ సాధించడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అయినాసరే.. ఇది నిజం.. ఎలాగంటే..

1960లో సినిమా టికెట్ ధర రూపాయి కంటే తక్కువే. కానీ..1960లో రిలీజైన సినిమా రూ.కోటి వసూలు చేస్తే ప్రస్తుతం దాని విలువ...రూ.330-380 కోట్లు!

1995లో రిలీజైనదైతే..రూ.35-40 కోట్లు!

మొఘల్-ఏ-ఆజమ్ 15 కోట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దీనిద్వారా అప్పట్లోనే రూ.11 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి.

ద్రవ్యోల్బణాన్ని లెక్కకట్టి చూస్తే.. ఆ 11 కోట్ల రూపాయల విలువ ఇప్పుడు నాలుగు వేల కోట్ల రూపాయలు!

గతేడాది రిలీజైన షారుక్ 'జవాన్' సినిమాకు దాదాపు 5 కోట్ల టికెట్స్ సేల్ అయ్యాయి.రూ.1000 కోట్లకు పైనే వసూళ్లు దక్కాయి.

ఈ లెక్క ప్రకారం చూసుకున్నా సరే 'మొగల్ ఈ ఆజమ్' వసూళ్లు రూ.3800-4000 కోట్ల మధ్యే ఉంటాయి

దీని తర్వాతి స్థానంలో అమితాబ్ 'షోలే' ఉంటుంది. 1975లో రిలీజై రూ.30 కోట్లు వసూళ్లు సొంతం చేసుకుంది

ఇప్పటి లెక్క ప్రకారం చూస్తే ఈ సినిమా కలెక్షన్స్ దాదాపు రూ.3090 కోట్లు ఉంటాయి!

ఈ రెండింటి తర్వాత ఆమిర్ ఖాన్ 'దంగల్', ప్రభాస్ 'బాహుబలి' ఉంటాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

దీనిబట్టి చూస్తే అత్యధిక కలెక్షన్ సాధించిన భారతీయ సినిమా అంటే ఇప్పటికీ 'మొగల్ ఈ ఆజమ్'నే