‘అనుభవవించు రాజా’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే..? | Anubhavinchu Raja Movie First Day Collections | Sakshi
Sakshi News home page

Anubavinchu Raja Collections: 'అనుభవవించు రాజా’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే..?

Published Sat, Nov 27 2021 2:04 PM | Last Updated on Sat, Nov 27 2021 3:10 PM

Anubhavinchu Raja Movie First Day Collections - Sakshi

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్  హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్  అనుభవించు రాజా. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(నవంబర్‌ 26)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే కలెక్షన్స్‌ పరంగా మాత్రం ఈ మూవీ దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

ఈ వారం పెద్ద చిత్రాలేవి లేకపోవడం, విడుదలైన చిన్న  చిత్రాల్లో ‘అనుభవించు రాజా’కే మంచి​ స్పందన రావడంతో బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లనే రాబట్టింది. దాదాపు 450 పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తొలి రోజే రూ.70 లక్షలకు పైగా వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. వీకెండ్‌లో ఈ కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. అనుభవించు రాజా చిత్రానికి రూ.3.90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.సో బ్రేక్ ఈవెన్ కు రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ వీకెండ్‌లో భారీగా వసూళ్లను రాబడితే.. బ్రేక్‌ ఈవెన్‌ ఈజీగా అవుతుందనే చెప్పాలి. పోటీగా మరే క్రేజీ మూవీ లేకపోవడం.. అనుభవించు రాజా కి ప్లస్ పాయింట్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement