Anubhavinchu Raja Movie
-
ఈ వారం సందడి చేయనున్న చిత్రాలివే!
కరోనా తగ్గుముఖం పట్టాక ఇండస్ట్రీ సినిమా రిలీజ్‌ల మీద దృష్టిపెట్టింది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్ వరకు కదిలి వస్తారని అఖండ సినిమా నిరూపించడంతో చిన్న చిత్రాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో దూకుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం పెద్దపెద్ద సినిమాలు కూడా రిలీజవుతున్నాయి. అటు థియేటర్‌తో పాటు ఓటీటీలో కూడా పలు చిత్రాలు సందడి చేయనున్నాయి. అవేంటో చూద్దాం.. స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ అందరికీ ఎంతో ఇష్టమైన కార్టూన్ స్పైడర్ మ్యాన్. ఈ కార్టూన్ సాహసాలు చేస్తూ అలరించేందుకు రెడీ అయ్యాడు. జాన్ వాట్స్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్: నో వే హోమ్‌లో టామ్ హోలాండ్, బెనిడిక్ట్ కంబర్బ్యాచ్, జాకబ్ బ్యాట్లాన్, జందాయా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. భూమిని నాశనం చేయడానికి వచ్చిన శత్రువులను స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూసి తీరాల్సిందే! ఈ చిత్రం ఈ నెల 16న రిలీజ్ అవుతోంది. పుష్ప ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగం పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న రిలీజ్ అవుతోంది. అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్ ముఖ్యపాత్రలు పోషించారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఊ అంటావా మావా.. అనే ఐటం సాంగ్‌లో ఆడిపాడింది. ఈ పాన్ ఇండియా మూవీ ఐదు భాషల్లో విడుదలవుతోంది. అనుభవించు రాజా యంగ్ హీరో రాజ్‌తరుణ్ హీరోగా కశిష్ ఖాన్ హీరోయిన్గా నటించిన చిత్రం అనుభవించు రాజా. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ నవంబర్ 26న థియేటర్లో రిలీజైంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ బాట పట్టింది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో డిసెంబర్ 17 నుంచి అందుబాటులోకి రానుంది. జీ5 ♦ 420 ఐపీసీ(హిందీ) - డిసెంబరు 17 నెట్‌ఫ్లిక్స్ ♦ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ (హాలీవుడ్) - డిసెంబరు 17 ♦ ది విచ్చర్ వెబ్ సిరీస్ - డిసెంబరు 17 ♦ కడశీల బిర్యాని తమిళ్ - డిసెంబరు 17 -
ఓటీటీలోకి అనుభవించు రాజా, ఎప్పుడు రిలీజంటే?
Anubhavinchu Raja On OTT: రాజ్ తరుణ్, కశీష్ ఖాన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం అనుభవించు రాజా. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మించింది. నవంబర్ 26న రిలీజైన ఈ మాస్ ఎంటర్టైనర్ మూవీ ఆహాలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. థియేటర్లో రిలీజై నెల రోజులైనా కాకముందే ఆహాలో ప్రసారం కానుంది. డిసెంబర్ 17 నుంచి అనుభవించు రాజా చిత్రం అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో ఊర్లో ఆవారాగా తిరిగే బంగార్రాజుగా, సిటీలో సిన్సియర్‌గా విధులు నిర్వర్తించే సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేసేవాడిగా రెండు వేరియేషన్స్ చూపించాడు రాజ్‌తరుణ్. తనదైన కామెడీతోనూ నవ్వించాడు. ఈ సినిమా ఇప్పటివరకు చూడనివాళ్లు మరో వారం రోజుల్లో ఆహాలో ఎంచక్కా వీక్షించొచ్చు. ఇదివరకే చూసినవాళ్లు మరోసారి అనుభవించు రాజా చూసి సరదాగా నవ్వుకోవచ్చు! -
రాజ్ తరుణ్ అంటే అసలు నచ్చదు.. అరియానా షాకింగ్ కామెంట్స్
Ariyana Glory Shocking Comments On Raj Tarun: యంగ్ హీరో రాజ్‌తరుణ్‌పై బిగ్‌బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు రాజ్ తరుణ్ అంటే అసలు నచ్చదంటూ అందరినికి షాక్ గురి చేసింది. రాజ్ తరుణ్ తాజాగా నటించిన అనుభవించు రాజా చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అరియానా ఓ పాత్ర పోషించింది. ఈ సందర్భంగా మూవీ టీంతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అరియాన సరదాగా హీరో, దర్శకుడిని ఆటపట్టించింది. ఈ క్రమంలో రాజ్ తరుణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: ఆర్ఆర్ఆర్ మూవీకి అలియా పారితోషికమెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే! ఈ మేరకు అరియాన మాట్లాడుతూ.. ‘నిజం చెప్పాలంటే ఒకప్పుడు రాజ్ తరుణ్ అంటే నాకు అస్సలు నచ్చదు. కానీ తనతో సినిమాకు ఎలా చేశానో అర్థం కావట్లేదు. టీవీలో ఆయన సినిమాలు వస్తే అవి తీసేయ్‌మని చెప్పేదాన్ని. ఒకరోజు రాజ్ కారులో వెళుతుంటే తనకి యాక్సిడెంట్ అవ్వాలని కోరుకున్నా’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎందుకని అంత అసహ్యమని మిగతా సినిమా క్రూడ్ అడగ్గా.. ‘ఇలాగే ఒక ఇంటర్వ్యూకి పిలిచారు. అప్పుడు చాలా సేపు వేయిట్ చేయించాడు. నా ముందే కారులో వెళుతుంటే హీరో ఏంటి వెళ్లిపోతున్నాడని అడగ్గా డబ్బింగ్ కరెక్షన్ ఉందని వెళుతున్నాడు’ అని చెప్పారు. చదవండి: శివ శంకర్ మాస్టర్ చివరి కోరిక ఏంటో తెలుసా? అంతకు ముందు కూడా ఓ చానల్లో చేసేటప్పుడు రాజ్‌ని ఇంటర్వ్యూ చేయాల్సి ఉంది. వాళ్ల సినిమా చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది. ఇక హీరోతో ఇంటర్వ్యూ అని చాలా ఎక్జయిటింగ్‌గా ఉన్నాను. చూస్తున్నా, చూస్తున్నా ఆయన ఎంతకు రావడం లేదు. మూడు గంటలు వేయిట్ చేశాను. చివరకు ఆయన సినిమా హిట్ అయ్యిందని, సార్ పటా వెళ్లిపోయారని చెప్పారు. ఇలా రెండుసార్లు రాజ్ వల్ల నాకు చేదు అనుభవం ఎదురైంది. అందుకే కారులో వెళుతుంటే యాక్సిడెంట్ అయ్యి కాలో, చెయ్యో విరగాలి అనుకున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు రాగానే తన ఫస్ట్ మూవీ రాజ్‌తో నటించే అవకాశం వచ్చిందని చెప్పింది. ఇక సినిమా సెట్‌కు రాగానే రాజ్ ఎదురవ్వడంతో ఈయన ఎందుకు వచ్చాడా? అని అనుకున్నానని పేర్కొంది. చదవండి: సెట్లో గాయపడ్డ యంగ్ హీరో, 25 కుట్లు, 2 నెలలు షూటింగ్‌కు బ్రేక్.. ఇక రాజ్ తరణ్ తన పక్కనే కూర్చుని మాట్లాడుతుంటే ‘ఇతనేందుకు నాతో మాట్లాడుతున్నాడు’ అని అనుకునేదాన్ని అంంటూ దర్శకుడు గవిరెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజ్‌తో మాట్టాడటం నచ్చక మధ్య మధ్యలో గవిరెడ్డి గారిని చూస్తూ ఈయనేవరో తెలియదు, సినిమా ఎందుకు ఒప్పుకున్నానో ఏంటో అంటూ మనసులో తిట్టుకున్నట్టు చెప్పింది. అంతేగాక రాజ్‌తో సీన్స్ చేస్తున్నప్పుడు దర్శకుడు గవిరెడ్డిని చూస్తు ఈయన నా ముందు ఉంటే బాగుండు, ఈ సీన్లో ఆయన ఉంటే బాగుండు అనుకునేదాన్నంటూ అరియాన కామెంట్స్ చేసింది. అంతేగాక ఓ రోజు కావాలనే సెట్లో రాజ్ తరుణ్‌ను 8 గంటలు వేయిట్ చేయించాను అనగానే డైరెక్టర్ అరియానను ఆడుకోవడం మొదలు పెట్టాడు. ఈ ఇంటర్వ్యూలో అనుభవించు రాజా మూవీ హీరోయిన్, దర్శకుడు గవిరెడ్డి, బిగ్‌బాస్ ఫేం రవి కృష్ణ కూడా పాల్గొన్నారు. -
‘అనుభవవించు రాజా’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..?
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(నవంబర్ 26)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ మూవీ దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ వారం పెద్ద చిత్రాలేవి లేకపోవడం, విడుదలైన చిన్న చిత్రాల్లో ‘అనుభవించు రాజా’కే మంచి స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే రాబట్టింది. దాదాపు 450 పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తొలి రోజే రూ.70 లక్షలకు పైగా వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. వీకెండ్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. అనుభవించు రాజా చిత్రానికి రూ.3.90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.సో బ్రేక్ ఈవెన్ కు రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ వీకెండ్లో భారీగా వసూళ్లను రాబడితే.. బ్రేక్ ఈవెన్ ఈజీగా అవుతుందనే చెప్పాలి. పోటీగా మరే క్రేజీ మూవీ లేకపోవడం.. అనుభవించు రాజా కి ప్లస్ పాయింట్. -
‘అనుభవించు రాజా’ మూవీ రివ్యూ
టైటిల్ : అనుభవించు రాజా నటీనటులు : రాజ్ తరుణ్, కషీష్ ఖాన్, పోసాని కృష్ణ మురళి, ఆడుగలమ్ నరేన్, అజయ్, సుదర్శన్, టెంపర్ వంశీ, అరియానా తదితరులు నిర్మాణ సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి నిర్మాత : సుప్రియ యార్లగడ్డ దర్శకత్వం: శ్రీను గవిరెడ్డి సంగీతం : గోపీసుందర్ సినిమాటోగ్రఫీ : నగేశ్ బానెల్ ఎడిటింగ్: ఛోటా కె.ప్రసాద్ విడుదల తేది : నవంబర్26, 2021 యంగ్ హీరో రాజ్ తరుణ్ ఓ సాలిడ్ హిట్‌గా చాలా కష్టపడుతున్నాడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకున్న రాజ్ తరుణ్..ఆ తర్వాత ఆ హవాను కొనసాగించడంలో విఫలమం అయ్యాడు. ఇప్పటి వరకు ఆయన డజన్‌కు పైగా చిత్రాలు చేసినప్పటికీ.. కెరీర్ మొదట్లో వచ్చిన ఉయ్యాల జంపాల, కుమారి 21 ఎఫ్ మాత్రమే హిట్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ‘అనుభవించు రాజా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కడం విశేషం. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు.. సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ శుక్రవారం(నవంబర్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అనుభవించు రాజా’ను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘అనుభవించు రాజా’ కథేంటంటే పశ్చిమగోదావరి జిల్లా యండగండికి చెందిన బంగార్రాజు అలియాస్ రాజ్ (రాజ్ తరుణ్) పూర్వికులు కోటీశ్వరులు. పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నప్పటకీ.. రాజ్ మాత్రం సొంత ఊరిని వదిలి హైదరాబాద్‌లోని ఓ ఐటీ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేస్తుంటాడు. ఇదే సమయంలో అతన్ని హత్య చేసేందుకు గని గ్యాంగ్‌కు ఓ వ్యక్తి పెద్ద ఎత్తున సుపారీ ఇస్తాడు. అసలు రాజ్ హత్య చేయడానికి సుపారీ ఇచ్చిన వ్యక్తి ఎవరు? కోట్ల ఆస్తులకు అధిపతి అయిన రాజ్..సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం ఎందుకు చేశాడు? అతను గ్రామం నుంచి పారిపోవడానికి గల కారణాలేంటి? అనేదే మిగతా కథ ఎవరెలా చేశారంటే... జల్సారాయుడు లాంటి బంగార్రాజు పాత్రలో రాజ్ తరుణ్ ఒదిగిపోయాడు. తనదైన కామిక్ టైమింగ్, ఎగతాళితో అందరిని నవ్వించే ప్రయత్నం చేశాడు. ఊర్లో అవారాగా తిరిగే బంగార్రాజుగా, సిటీలో సిన్సియర్‌గా సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేసే రాజ్‌గా రెండు విభిన్న పాత్రలో కనిపించిన రాజ్ తరుణ్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. హీరోయిన్ కషీష్ ఖాన్ తన పాత్ర నిడివి తక్కువే అయినప్పటీ.. ఉన్నంతలో చక్కగా నటించింది. ఇక గ్రామ ప్రెసిడెంట్‌గా ఆడుగలమ్ నరేన్, సెక్యూరిటీ గార్డ్స్ హెడ్‌గా పోసాని మెప్పించారు. హీరో ఫ్రెండ్‌గా నటించిన సుదర్శన్.. తనదైన పంచ్‌లతో నవ్వించాడు. అజయ్, అరియానా, రవిలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? శ్రీను గవిరెడ్డి, రాజ్ తరుణ్ కాంబినేషన్లో ఇప్పటికే ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ’అనే మూవీ వచ్చింది. కానీ అది పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈ సారి మాత్రం రాజ్ తరుణ్‌కు అచ్చొచ్చిన కామెడీ జానర్లో ‘అనుభవించు రాజా’తో మరో ప్రయత్నం చేశాడు దర్శకుడు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కించామంటూ.. రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుందని మొదటి నుంచి దర్శక నిర్మాతలు చెబుతూ వచ్చారు. అయితే సినిమాలో మాత్రం మరీ పగలబడి నవ్వేంత సీన్స్ మాత్రం ఏమీ ఉండవు. ఫస్టాఫ్ అంతా హైదరాబాద్‌లో హీరోగా సెక్యూరిటీ గార్డ్‌గా ఉద్యోగం చేయడం,అక్కడే హీరోయిన్‌తో ప్రేమలో పడడం లాంటి సన్నివేశాలతో ముగించిన దర్శకుడు.. ఇంటర్వెల్ ముందు ఓ ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై క్యూరియాసిటీ పెంచేలా చేశాడు. ఇక సెకండాఫ్ మొత్తం పల్లెటూరి నేపథ్యంలో సాగుంది. అక్కడ కామెడీకి మరింత స్కోప్ ఉన్నప్పటికీ.. రోటీన్‌గానే కథను నడిపించారు. ప్రెసిడెంట్ ఎన్నికల సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోవు. రోటీన్ కామెడీ సీన్స్‌తో లాగించాడు. అయితే ప్రెసిడెంట్ కుటుంబంలో జరిగే హత్య వెనుక ఉన్నదెవరనేది మాత్రం ప్రేక్షకుడికి ఆసక్తిరేకెత్తించేలా తెరకెక్కించాడు. స్క్రీన్‌ప్లే బాగుంది. ఇక సాంకేతిక విషయానికొస్తే... గోపీసుందర్ సంగీతం చాలా బాగుంది. పాటలతో పాటు నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. నగేశ్ బానెల్ సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి అందాలను తెరపై చక్కగా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఊహించనంత గొప్ప సినిమా అయితే కాదనే చెప్పాలి. -
బెట్టింగులు, గ్యాబ్లింగ్ అంటే నచ్చదు కానీ.. : రాజ్ తరుణ్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో రాజ్ తరుణ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు... ‘అనుభవించు రాజా’సినిమా ఎలా ఉండబోతుంది? అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ, తండ్రి కొడుకుల సంబంధంతో పాటు విలేజ్ ఎమోషన్స్ కూడా బలంగా ఉన్నాయి. బంగారం క్యారెక్టర్ ఎలా అనిపించింది? బాగా నచ్చింది. ఆ పాత్రను ఎంజాయ్ చేస్తూ సినిమా షూటింగ్ చేశాం. ప్రేక్షకులకు కూడా ఆ పాత్ర బాగా నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ మూవీలో సెక్యూరిటీ గార్డుగా చేశారు. ఆ పాత్రకు కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు? మామూలుగా మనం సెక్యురిటీ గార్డ్స్ అంటే ఏంటి.. అలా నిల్చుంటారు.. రాత్రంతా ఉంటారు కష్టపడతారు అని అనుకుంటాం. కానీ దాని వెనకాల ఉండే ప్రిపరేషన్స్ ఏంటో నాకు ఈ సినిమా చేసినప్పుడే అర్థమైంది. వాళ్ల ట్రైనింగ్ ఎలా ఉంటుంది.. వారు ఎంత కష్టపడతారో తెలిసింది. పొద్దున్న మన గేట్ తీసేది సెక్యురిటే, రాత్రి గేట్ వేసిది సెక్యురిటే. వాళ్ళు నవ్వుతూ పనిచేస్తే ఆ రోజంతా మనకు బావుంటుంది. అలా నవ్వుతూ ఆ జాబ్ చేయడం అంత ఈజీ కాదు. ట్రైలర్ చూస్తే కోడి పందాలు ఎలిమెంట్స్ కనిపించాయి. మీ నిజ జీవితంలొ కోడిపందాలు వేశారా? లేదు. బెట్టింగులు, గ్యాబ్లింగ్ అంటే నాకు అస్సలు నచ్చదు. వాటి జోలిని ఎప్పుడు వెళ్లలేదు.వెళ్లను కూడా. సంక్రాంతి కోళ్ళ పందాలు చూశాను. మా సినిమాలో సంక్రాంతి వుంది. ఈ సినిమాలో కోడిని షూటింగ్ కోసం తీసుకొచ్చాం. షూటింగ్ అయిపోయాక ఇంటికి తీసుకెళితే అది తినడం లేదని చెప్పారు. బహుశా దానికి కూడా షూటింగ్ అలవాటైపొయిందేమో (నవ్వుతూ). భీమవరం షూటింగ్ ఎలా అనిపిచింది ? నా కెరీర్ సగం సినిమాలు అక్కడే చేశా. అక్కడ మనుషులు, ఫుడ్ బావుంటుంది. సరదాగా గడిచిపోయింది. దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డితో రెండో సినిమా. తొలి సినిమాకి ఇప్పటికి అతనితో ఎలా అనిపించింది? శ్రీనివాస్ నా బెస్ట్ ఫ్రెండ్. ఫస్ట్ మూవీ ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా చేసినప్పుడు అతను కుర్రాడు. ఇప్పుడు చాలా మెచ్యురిటీ వచ్చింది. చాలా నెమ్మది వచ్చింది. సినిమాని అర్ధం చేసుకోవడంలో అప్పటికి ఇప్పటికి స్పష్టమైన తేడా కనిపించింది. అన్నపూర్ణ స్టూడియోస్‌తో సంబంధం? అన్నపూర్ణ స్టూడియోస్‌తోనే నేను హీరోగా(ఉయ్యాలా జంపాలా మూవీ) పరిచయమయ్యారు. ఇప్పుడు అదే బ్యానర్‌పై మూడో సినిమా చేస్తున్నాను. అంత పెద్ద బ్యానర్లో సినిమా చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం నాగచైతన్య సినిమా చూశారట కదా? అవును. ఇటీవల నాగచైతన్య ‘అనుభవించు రాజా’ సినిమా చూశారు. ఆయనకు మా సినిమా బాగా నచ్చింది. సినిమా పూర్తయ్యాక.. శ్రీనుతో అరగంట సేపు మాట్లాడారు. సినిమా బాగుందని చెప్పారు కొన్ని ప్రయోగాలు చేశారు. మళ్ళీ పాత జోనర్ కి వచ్చారు. సేఫ్ గేమ్ అనుకోవచ్చా ? అదేంలేదు. మనం అదీ ఇదీ అని లెక్కలు వేసుకుంటే వర్కౌట్ కాదు. కథ బావుంటే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సినిమాలో వినోదం మీ పాత్ర చుట్టే ఉంటుందా? లేదు, పోసాని, సుదర్శన్, అజయ్ ఇలా చాలా మంది వున్నారు. అన్నీ పాత్రల్లో ఫన్ వుంటుంది. కథంతా నా పాత్ర చుట్టే తిరుతుంది కాబట్టి.. నా కామెడీ కాస్త ఎక్కువగా ఉంటుంది హీరోయిన్ కశిష్‌ఖాన్ గురించి ? తెలుగు రాకపోయిన చాలా బాగా నేర్చుకొని సొంతగా డైలాగులు చెప్పడానికి ప్రయత్నించింది. మంచి మనిషి. షూటింగ్ సమయంలో మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. చాలా ప్రశాంతంగా వుంటుంది. కొత్త సినిమా కబుర్లు ఏంటి? స్టాండప్ రాహుల్ రెడీ అవుతుంది. మాస్ మహారాజా సినిమా షూటింగ్ స్టార్ అయ్యింది. మరిన్ని కథలు వింటున్నా. -
‘నాగార్జున, నాగచైతన్యలకు కథ నచ్చడంతో మా సినిమా మొదలైంది’
‘‘జీవితం చాలా చిన్నది.. ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలనేది ‘అనుభవించు రాజా’ కథ’’ అని డైరెక్టర్ శ్రీను గవిరెడ్డి అన్నారు. రాజ్ తరుణ్, కశిష్ ఖాన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘అనుభవించు రాజా’. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీను గవిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘పూరి జగన్నాథ్ స్ఫూర్తితో ఇండస్ట్రీకి వచ్చి, అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. నేను దర్శకత్వం వహించిన ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, గరమ్’ సినిమాలు 2016లో విడుదలైనా అంతగా ఆడలేదు. ఆ తర్వాత ‘అనుభవించు రాజా’ కథ రాసుకున్నాను. సుప్రియగారు కథ విని ఓకే అన్నారు. నాగార్జున గారు, నాగచైతన్యలకు కూడా కథ నచ్చడంతో ఈ సినిమా మొదలైంది. ఇందులో రాజ్ తరుణ్ సెక్యూరిటీ గార్డ్‌గా కనిపిస్తారు. ‘మనం ఎక్కడుంటే అది మన ఊరు కాదు.. మనం పుట్టిందే మన ఊరు’ అనే ఎమోషన్ ఇందులో ఉంటుంది. ఈ సినిమాను నాగచైతన్య చూసి, బాగుందన్నారు. ఇండస్ట్రీ, సినిమాలు నాకు చాలా నేర్పించాయి. నా బలం ఎంటర్టైన్మెంట్. నా తర్వాతి సినిమా ఓ మంచి బ్యానర్లో ఓకే అయింది’’ అన్నారు. -
నటి కాశీష్ ఖాన్ లేటెస్ట్ స్టిల్స్
-
ఈ వారం సినీ ప్రియులను అలరించే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు తెలుసా ?
Upcoming Movies And Web Series On This Week: సినీ ప్రియులకు సినిమాలు చూడటమే ఆనందం. అందుకే ఎప్పుడెప్పుడూ ఏ కొత్త సినిమా విడుదలవుతుంది ? ఏ వెబ్ సిరీస్ చూద్దాం ? అంటూ ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచనలకు చెక్ పెడుతూ ఈ వారం థియేటర్లు, ఓటీటీలు కళకళలాడనున్నాయి. ప్రేక్షకులను అలరించేందుకు ఈ వారం థియేటర్‌తో పాటు ఓటీటీలో రానున్న పలు హిందీ, తెలుగు ఆసక్తికర చిత్రాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందామా ! 1. అంతిమ్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రం 'అంతిమ్: ది ఫైనల్ ట్రూత్'. మహేశ్ వి. మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయుష్ శర్మ కీలకపాత్ర పోషించారు. ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 26న థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో సల్మాన్ ఖాన్ పోలీసు ఆఫిసర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కేవలం 60 రోజుల్లోనే పూర్తి చేశారు. 2. అనుభవించు రాజా రాజ్‌తరుణ్ కీలక పాత్రలో శ్రీను గావిరెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అనుభవించు రాజా’. ఉభయ గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే ఓ యూత్‌ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందింది. కషికా ఖాన్ కథానాయికగా చేసిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లు అందులోని సంభాషణలు ఆకట్టుకున్నాయి. నవంబర్ 26న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. 3. ది లూప్ తమిళంతో పాటు, తెలుగులోనూ గుర్తింపు ఉన్న నటుడు శింబు. ఈ తమిళ స్టార్హీరో ఇప్పుడు పాన్ ఇండియా చిత్రంతో అలరించేందుకు 'ది లూప్' సినిమాతో రానున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్‌ప్రభు దర్శకత్వంలో శింబు నటించిన తమిళ చిత్రం ‘మానాడు’. దీన్ని తెలుగులో ‘ది లూప్’ పేరుతో నవంబరు 25న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కించినట్లు సమాచారం. 4. ఆశ ఎన్కౌంటర్ యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిన హైదరాబాద్ గ్యాంగ్‌రేప్‌ను ఆధారంగా చేసుకుని వస్తోన్న సినిమా 'ఆశ ఎన్కౌంటర్'. 2019 నవంబర్ 26న హైదరాబాద్ నగరశివారులోని చటాన్‌పల్లి వద్ద ఓ యువతిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం ఆమెను హత్య చేశారు. ఇదే కథను నేపథ్యంగా చేసుకుని ఆనంద్ చంద్ర ఈ సినిమాను తెరకెక్కించారు. నవంబర్ 26న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాను ఆర్జీవీ సమర్పిస్తున్నారు. 5. క్యాలీఫ్లవర్ సంపూర్ణేష్ బాబు హీరోగా ఆర్కే మలినేని దర్శకత్వం వహించిన వినోదాత్మక చిత్రం ‘క్యాలీప్లవర్’. దీనికి 'శీలో రక్షతి రక్షితః' అన్నది క్యాప్షన్. కథానాయికగా వాసంతి నటించగా, పోసాని కృష్ణమురళి, పృథ్వీ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం నవంబరు 26న థియేటర్లలో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. 6. భగత్ సింగ్ నగర్ భగత్ సింగ్ రాసిన ఓ లైన్‌ను ఆదర్శంగా తీసుకొని సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'భగత్ సింగ్ నగర్ వాలాజా క్రాంతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విదార్థ్, ధృవీక జంటగా నటించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్రాన్ని వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు సంయుక్తంగా నిర్మించారు. నవంబర్ 26న థియేటర్లలో విడుదల కానుంది. 7. కార్పొరేటర్ కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు షకలక శంకర్. అంతేకాదు, ఆయన కథానాయడిగానూ నటించారు. తాజాగా ఆయన కీలక పాత్రలో సంజయ్ పునూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్పొరేటర్’. సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నవంబరు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. వినోదంతో పాటు, రాజకీయ సందేశంతో కూడిన చిత్రంగా ‘కార్పొరేటర్’ రూపొందించారు. 8. 1997 డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, సంగీత దర్శకుడు కోటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘1997’. డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాచరు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘1997’ను నవంబరు 26న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈశ్వర్ పార్వతి మూవీస్ పతాకంపై మీనాక్షి రమావత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓటీటీలో సందడి చేసే చిత్రాలు.. అమెజాన్ ప్రైమ్ వీడియో * దృశ్యం-2, నవంబర్ 25 * చ్చోరీ (హిందీ), నవంబరు 26 నెట్‌ఫ్లిక్స్ * పెద్దన్న * ట్రూ స్టోరీ (హాలీవుడ్), నవంబరు 24 * బ్రూయిజ్డ్ (హాలీవుడ్), నవంబరు 24 * ఏ కాజిల్ ఫర్ క్రిస్మస్ (హాలీవుడ్), నవంబరు 26 డిస్నీ+ హాట్‌స్టార్ * 2024(హిందీ), నవంబరు 23 * హాకేయ్ (తెలుగు డబ్బింగ్), నవంబరు 24 * దిల్ బెకరార్ (వెబ్ సిరీస్), నవంబరు 26 జీ5 * రిపబ్లిక్, నవంబర్ 26 ఆహా * రొమాంటిక్, నవంబర్ 26 -
సిరి.. పెళ్లి సంబంధాలు చూస్తున్నాం: రాజ్ తరుణ్
Bigg Boss Telugu 5, Anubhavinchu Raja Team Visits Bigg Boss House: బిగ్‌బాస్ షోలో అనుభవించు రాజా చిత్రయూనిట్ సందడి చేసింది. హీరోహీరోయిన్లు రాజ్ తరుణ్, కశిష్ ఖాన్ బిగ్‌బాస్ స్టేజీపై సందడి చేశారు. రాజ్ తరుణ్‌ను చూడగానే సిరి ఎగిరి గంతేసింది. పెళ్లి సంబంధాలు చూస్తున్నామని రాజ్ తరుణ్ చెప్పడంతో సిరి తెగ సిగ్గుపడిపోగా వెంటనే.. నీక్కాదులే అంటూ కౌంటరిచ్చాడు. తర్వాత ఇంటిసభ్యులకు డ్రాయింగ్ గేమ్‌తో కంటెస్టెంట్లను గుర్తించమని టాస్క్ ఆడించారు. ఇందులో ప్రియాంక పిచ్చిగీతలు ఒక్క మానస్‌కు మాత్రమే అర్థమయ్యాయి. ఆమె గీసిన గీతలను బట్టి అది శ్రీరామ్ అని మానస్ ఆన్సరివ్వడంతో అందరూ ఆశ్యర్యానికి లోనయ్యారు. నామినేషన్స్ నుంచి అందరూ సేవ్ అవగా చివర్లో ప్రియాంక, యానీ ఇద్దరు మాత్రమే మిగిలినట్లు ప్రోమోలో చూపించారు. ఈ ఇద్దరిలో యానీ మాస్టర్ ఎలిమినేట్ అయిందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. మరి అదెంతవరకు నిజమనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. -
చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ ఉండదు: నిర్మాత సుప్రియ యార్లగడ్డ
‘చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ ఉండదు. అందులోంచే కొత్త టాలెంట్ వస్తుంది. బ్యానర్ వ్యాల్యూ, స్టూడియో సపోర్ట్ ఉంటేనే ఇలాంటి సినిమాను తీయగలం. చిన్న సినిమాను తీయడం మామూలు విషయం కాదు. ఒక చిన్న సినిమాను హిట్ చేయగలిగితే వచ్చే సంతృప్తి మాటల్లో చెప్పలేం’అన్నారు నిర్మాత సుప్రియ యార్లగడ్డ. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సుప్రియ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► తాత గారు ఎంత ఇచ్చారు.. దాన్ని చిన్న మామ (నాగార్జున) ఎంతలా పెంచారు.. అనేది ఇప్పుడు తెలుస్తోంది. తాతగారు ఉన్నపుడు విలువ తెలియలేదు. అన్నపూర్ణ స్టూడియోను తాతగారు కట్టారు. చిన్న మామ నిలబెట్టారు. తాతగారు మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకునేవారు. సుమంత్‌ను ఇంకా ఎక్కువగా గారాభం చేసేశారు. ►అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద సినిమా అంటే దాదాపుగా నేనే కథలు వింటాను. ఒకవేళ చిన్న మామ, చైతూ హీరోలుగా కథలు వస్తే ముందు వాళ్లకే వినిపిస్తాను. నాకు కథ నచ్చితేనే ముందుకు వెళ్తాను. ఈ కథ విన్నప్పుడు చాలా నవ్వాను. నేను నవ్వాను అంటే ఓ పది మంది నవ్వుతారనే కదా. అందుకే ఈ సినిమా చేశాను. ►ఈ కథ మీద ఓ ఆరు నెలలు కూర్చోవాలి అని చెబితే కొందరు పారిపోతారు. కానీ శ్రీను ఉన్నాడు. మన జోకులు, మన నేటివిటీని మిస్ అవుతుంటాం. ఈ కథలో అది ఉంటుంది. ఏప్రిల్ 1న విడుదల, లేడీస్ టైలర్ వంటి సినిమాలు చూశాం. పెద్ద వంశీ గారి సినిమాల్లా ఉంటుంది. ►రాజ్ తరుణ్‌లో కామిక్ టైమింగ్, ఆ ఎగతాళి అన్నీ ఉంటాయి. ఈ కథ విన్న తరువాత రాజ్ తరుణ్ మాత్రమే కనిపించాడు. ఈ కథలో తను ఉంటే, తను చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. సినిమాకు ఎంత కావాలో అంత ఖర్చు పెట్టాలి. అది స్క్రీన్ మీద కనిపించాలి అని అనుకుంటాను. ►సినిమాను మొదలుపెట్టాలని అనుకున్నాం. అప్పుడే లాక్డౌన్ మొదలైంది. కానీ కరోనా వల్ల ప్రేక్షకులు చూసే కంటెంట్ కూడా మారింది. ఓటీటీలో రకరకాల కంటెంట్ చూడటం అలవాటు పడ్డారు. ►చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ ఉండదు. అందులోంచే కొత్త టాలెంట్ వస్తుంది. బ్యానర్ వ్యాల్యూ, స్టూడియో సపోర్ట్ ఉంటేనే ఇలాంటి సినిమాను తీయగలం. చిన్న సినిమాను తీయడం మామూలు విషయం కాదు. అందరూ చిన్న సినిమాలు తీయాలి. చిన్న సినిమాను హిట్ చేయగలిగితే వచ్చే సంతృప్తి మాటల్లో చెప్పలేం. ►ప్రస్తుతం ఉన్న సమయంలో అందరూ థియేటర్‌కు రావడమంటే కష్టం. కానీ ఎక్కడో చోట మొదలుపెట్టాలి. మన ఊరు, నేటివిటీ, అక్కడి వాతావరణాన్ని అంతా మిస్ అవుతున్నారు. ఇందులో అవన్నీ ఉంటాయి. పచ్చడన్నం లాంటి సినిమా. ►ఓటీటీలో ఆఫర్లు వచ్చాయి. కానీ ఇది థియేటర్ సినిమానే. ఈ కథకి ఓటీటీ కరెక్ట్ కాదు. థియేటర్లో చూస్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది. నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా. నాగార్జునకి ఇంకా పూర్తి సినిమాను చూపించలేదు. ►ఈ సినిమా తప్పకుండా గుర్తుండిపోతుంది. సరదాగా ఉంటుంది. పెద్ద జీవితం అనుకున్నదాంట్లో ఓ చిన్న స్పీడు బ్రేకర్.. దాన్ని ఎలా సరిదిద్దుకున్నాడు.. ప్రతీవోడు ప్రెసిడెంట్ అనుకోవాలని అనుకుంటాడు. కానీ ఆ సత్తా ఉండాలి కదా...అలా సరదా సరదాగా సాగేదే అనుభవించు రాజా సినిమా. ►నాకు అన్నీ పోలీస్ ఆఫీసర్ పాత్రలే వస్తున్నాయి. ఎన్ని సార్లు అదే పాత్రను చేయాలి. అందుకే ఒప్పుకోవడం లేదు. గూఢచారి 2లో మంచి పాత్ర ఇస్తే తప్పకుండా చేస్తాను. నా పాత్ర ఇంకా అందులో సజీవంగానే ఉంది. ►ఒకప్పుడు ప్రతీ విషయంలో ఎంతో ఆలోచించేదాన్ని. ఇది చేస్తే ఇంత డబ్బులు మిగులుతాయా? ఇంత డబ్బులు పోతాయా? ఇలా ఎన్నో ఆలోచించేదాన్ని. నచ్చిందా? నచ్చలేదా? అనేది మాత్రమే చూడాలని తాతగారు చెప్పేవారు. అప్పటి నుంచి ఎక్కువగా ఆలోచించడం మానేశా. ఎక్కువగా కన్ఫ్యూజన్ అనిపిస్తే.. నచ్చలేదా? నచ్చిందా? అనేది ఆలోచించేదాన్ని. నచ్చితే చేసేయడం లేదంటే లేదు. ►ఫ్యూచర్లో దర్శకత్వం వహిస్తానేమో. కానీ ఇప్పుడు ఎక్కువగా సినిమాలు తీయాలి. కొత్త కంటెంట్ రావాలి. ప్రేక్షకులు మారారు. కానీ మేకర్స్ మాత్రం ఇంకా మారడం లేదు. మూస ధోరణిలోనే ఆలోచిస్తున్నారు. అందరూ కంటెంట్ అనే పదాన్ని వాడుతున్నారు. అది స్టుపిడ్. కంటెంట్ కాదు.. మంచి కథలను చెప్పండి.