శివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చిన 'గామి' సినిమా బాక్సాఫీస్ దగ్గర రచ్చ లేపుతోంది. వీకెండ్ అయ్యేసరికే లాభాల్లోకి వెళ్లిపోయింది. అలానే విశ్వక్ సేన్ గత చిత్రాలతో పోలిస్తే ఇది అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. దాదాపు ఆరేళ్ల పాటు తీసిన ఈ సినిమాకు ప్రతిఫలం ఇప్పుడు వసూళ్ల రూపంలో కనిపిస్తోంది. తాజాగా వీకెండ్ అయ్యేసరికి అద్భుతమైన మార్క్ దాటేసింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
విద్యాధర్ కాగిత అనే యువ దర్శకుడు తీసిన తొలి సినిమా 'గామి'. క్రౌడ్ ఫండింగ్‌తో మొదలై, ఆగుతూ ఆగుతూ ఈ చిత్రాన్ని ఆరేళ్ల పాటు తీశారు. అన్ని అడ్డంకుల్ని క్లియర్ చేసుకుని తాజాగా మార్చి 8న థియేటర్లలోకి వదిలారు. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచిన ఈ చిత్రం.. తొలిరోజు రూ.9 కోట్లు, రెండు రోజు రూ.6 కోట్లు, మూడు రోజు రూ.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంటే మూడు రోజుల్లో రూ.20.3 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు స్వయంగా నిర్మాతలే పోస్టర్ రిలీజ్ చేశారు.
ప్రయోగాత్మక కథతో తీసిన 'గామి' చిత్రానికి మూడు రోజుల్లో ఈ రేంజులో కలెక్షన్స్ రావడం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఈ వారం కూడా పెద్దగా చెప్పుకోదగ్గ చిత్రాలేం థియేటర్లలోకి రావట్లేదు కాబట్టి ఈ మూవీ మరిన్ని కోట్లు రాబట్టుకోవడం గ్యారంటీ. వీకెండ్ అయ్యేసరికే దాదాపు అన్నిచోట్ల లాభాల్లోకి వెళ్లిపోయిన 'గామి'.. ఓవర్సీస్‌లో మంచి నంబర్స్ నమోదు చేస్తోంది. లాంగ్ రన్‌లో మిలియన్ డాలర్స్ మార్క్ అందుకున్న ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
(ఇదీ చదవండి: ఆస్కార్-2024 విజేతల పూర్తి జాబితా.. ఆ సినిమాకు ఏకంగా ఏడు అవార్డ్స్)
MASSIVE FIRST WEEKEND for #Gaami at the Box Office ❤🔥
— V celluloid (@vcelluloidsoffl) March 11, 2024
Collects 20.3 CRORE+ Gross Worldwide in 3 days & ATTAINS PROFITS in all territories 🔥
Book your tickets now for the 𝗧𝗛𝗘 𝗕𝗥𝗘𝗔𝗧𝗛𝗧𝗔𝗞𝗜𝗡𝗚 𝗘𝗣𝗜𝗖 𝗙𝗥𝗢𝗠 𝗧𝗘𝗟𝗨𝗚𝗨 𝗖𝗜𝗡𝗘𝗠𝗔 💥
🎟️… pic.twitter.com/6SIBx8VTCb
Comments
Please login to add a commentAdd a comment