Baby Movie Actress Vaishnavi Chaitanya Not Getting New Chances - Sakshi
Sakshi News home page

Vaishnavi Chaitanya: వైష్ణవి నుంచి కొత్త కబురు ఎప్పుడు?

Published Mon, Aug 14 2023 8:09 PM | Last Updated on Mon, Aug 14 2023 8:22 PM

Baby Movie Actress Vaishnavi Chaitanya Not Getting New Chances - Sakshi

తెలుగులో చిన్న సినిమాలు హిట్ అవ్వడం అరుదు. ఒకవేళ అయినా వసూళ్లు సాధించిన సందర్భాలు తక్కువని చెప్పొచ్చు. అలాంటిది ఈ రెండు విషయాల్లో 'బేబీ' మూవీ సెన్సేషన్ సృష్టించింది. ఎలాంటి అంచనాల్లేకుండా కొన్నాళ్లు ముందు థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య అనే అమ్మాయి హీరోయిన్‌గా చేసింది. చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు ఈమెని తెగ పొగిడేశారు. కట్ చేస్తే ఇప్పుడు ఈమెని పెద్దగా పట్టించుకోవట్లేదా అని డౌట్ వస్తుంది. 

(ఇదీ చదవండి: మెహర్ రమేశ్.. కమెడియన్‌గా నటించాడని మీకు తెలుసా?)

డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య..  ఆ తర్వాత యూట్యూబర్‌గా మారింది. కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్‌లో నటిస్తూ మెల్లమెల్లగా క్రేజ్ పెంచుకుంది. ఈమె అయితే తన కథకు సరిగ్గా సరిపోతుందని భావించిన దర్శకుడు సాయి రాజేశ్.. 'బేబీ' హీరోయిన్‌గా ఈమెని ఎంపిక చేశాడు. బోల్డ్ స్టోరీకి తోడు ఈమె యాక్టింగ్‌కి మంచి పేరు వచ్చింది. దీంతో బోలెడన్ని కొత్త ఆఫర్లు వస్తాయని భావించింది. కానీ జరుగుతున్నది వేరు అనిపిస్తుంది.

'బేబీ' ప్రొడ్యూసర్ ఎస్కేన్ తీయబోయే రెండు కొత్త సినిమాల్లో వైష్ణవి హీరోయిన్ అనే టాక్ వినిపించింది. కానీ వీటికి ఇంకా చాలా టైముందని అంటున్నారు. అలానే రామ్, అల్లు శిరీష్ సినిమాల్లోనూ వైష్ణవిని హీరోయిన్‌గా తీసుకున్నారని అన్నారు. దీనిపై క్లారిటీ వస్తే గానీ అసలు విషయం తెలీదు. 'బేబీ'లో తన క్యారెక్టర్ బోల్డ్ కావడం కూడా బడా నిర్మాణ సంస్థల నుంచి పిలుపు రాకపోవడానికి కారణమేమో అని వైష్ణవిని కన్ఫ్యూజన్‌లో పడిపోయినట్లు తెలుస్తోంది. మరి వైష్ణవి నుంచి కొత్త సినిమా కబురు ఎప్పుడొస్తుందో ఏంటనేది చూడాలి.

(ఇదీ చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement