Baby Movie Director Sai Rajesh Love Story - Sakshi
Sakshi News home page

Baby Director Love Story: తన లవ్‌స్టోరీ బయటపెట్టిన 'బేబీ' డైరెక్టర్!

Published Mon, Jul 17 2023 7:07 PM | Last Updated on Mon, Jul 17 2023 7:13 PM

Baby Movie Director Sai Rajesh Love Story - Sakshi

Baby Movie Director Details: ప్రస్తుతం ఎవరిని కదిపినా డిస్కషన్ అంతా 'బేబీ' గురించే. ఎందుకంటే రియలస్టిక్ లవ్‌స్టోరీతో తీసిన ఓ సినిమా థియేటర్లలోకి వచ్చి చాలా కాలమైపోయింది. సరిగ్గా ఈ పాయింట్‌నే క్యాష్ చేసుకున్న 'బేబీ'.. యూత్‌కి పిచ్చిపిచ్చిగా ఎక్కేసింది. అయితే ఈ సినిమా చూసిన చాలామంది ఇది దర్శకుడి రియల్ లైఫ్ ప్రేమకథేనా అని సందేహపడ్డారు. ఇప్పుడు ఆ ప్రశలన్నింటిపై స్వయంగా ఆ డైరెక్టరే క్లారిటీ ఇచ్చేశాడు.

తెలిసిన కథే
'బేబీ' సినిమాలోని కథ కొత్తదేం కాదు. బస్తీలో పెరిగిన ఓ అమ్మాయి, తన ఇంటికి ఎదురుగా ఉన్న అబ్బాయిని స్కూల్‌లో ఉన్నప్పుడు లవ్ చేస్తుంది. కాలేజీలో అడుగుపెట్టిన తర్వాత మరో అబ్బాయితో రిలేషన్ లోకి వెళ్తుంది. ఏకంగా ఆ విషయంలో అడ్వాన్స్ అవుతుంది. ఇది మొదటి బాయ్ ఫ్రెండ్‌కి తెలిసిపోతుంది. దీంతో గొడవ జరుగుతుంది. చివరకు ఏమైందనేది అసలు స్టోరీ. రోజూ పేపర్, న్యూస్‌లో చదివే వార్తలానే ఈ సినిమా స్టోరీ ఉన్నట్లు చాలామందికి అనిపించింది.

(ఇదీ చదవండి: 'బేబీ' కలెక్షన్స్.. మూడో రోజుకే అన్ని కోట్ల లాభాలతో!)

అదే కారణం
'బేబీ' సక్సెస్ మీట్ ఆదివారం నిర్వహించగా అందులో దర్శకుడు సాయి రాజేశ్‌కు.. అసలు ఈ సినిమాకు ప్రేరణ ఏంటనే ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ.. '20 ఏళ్ల క్రితం నేను లవ్ చేశాను. ఓ 8 నెలలపాటు చాలా బాధ, కఠినమైన పరిస్థితులు అనుభవించాను. ఇది జరిగి చాలా కాలమైపోయినప్పటికీ ఆ బాధ అలానే ఉండిపోయింది. దాన్ని స్క్రీన్‌పై చూపిద్దామనే ఆలోచనతోనే ఈ స్టోరీ రాసుకున్నాను' అని చెప్పుకొచ్చారు. 

ఈ స్టోరీ నాది కాదు
'బేబీ'లో ఆనంద్ దేవరకొండ పాత్ర మీదేనా అనే ప్రశ్నకు డైరెక్టర్ సాయి రాజేశ్ సమాధానమిచ్చారు. 'ఆనంద్ పాత్ర నేను కాదు. ఎందుకంటే ప్రేమించిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకున్నాను. నా ఫస్ట్ లవ్ నా భార్యనే. కాకపోతే లవ్‌లో ఉన్నప్పుడు 8 నెలలు బాధ అనుభవించాను. ఆమెని ఎక్కడో దాచిపెట్టారు. ఎక్కడుందో తెలియకపోయేసరికి తెగ ఇబ్బంది పడ్డాను. ప్రేమలో నేను సక్సెస్ అయినా.. నా పిల్లలు ఎక్కడ లవ్ చేస్తారో అనే భయముంది. వాళ్లు నాలా బాధపడకూడదనే ఫీలింగ్ లోలోపల ఉంటుంది. ఇదంతా నేను స్క్రీన్‌పై చూపించాను' అని చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: లిప్‌లాక్‌,బోల్డ్‌ సీన్స్‌పై మా ఇంట్లో ఏమన్నారంటే: బేబీ హీరోయిన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement