sai rajesh neelam
-
'బేబి' డైరెక్టర్‌కి షాకింగ్ ఎక్స్‌పీరియెన్స్.. పాపం అలా అనేసరికి!
'బేబి' సినిమా గతేడాది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీనేజ్ లవ్ స్టోరీతో దర్శకుడు సాయి రాజేశ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. గతంలో పలు సినిమాలకు దర్శకుడు, నిర్మాతగా వ్యవహరించినప్పటికీ.. 'బేబి'తోనే అందరికీ బాగా పరిచయమయ్యాడు. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఇతడికి తాజాగా వింత అనుభవం ఎదురైంది. భోజనానికి పిలిచి మరీ షాకిచ్చారు. దీని గురించి స్వయంగా సాయి రాజేశ్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: పొరపాట్లు ఒప్పుకొన్న 'కల్కి' డైరెక్టర్.. ఆ మూడు విషయాల్లో!)'నిన్న ఒక స్నేహితుడు బలవంతం మీద , తన ప్రాణ స్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్లాను, 'నీ సినిమా అంటే మా వాడికి ప్రాణం, 50 సార్లు చూసుంటాడు, ఇన్నేళ్ల మా స్నేహం లో ఏది ఆడగలేదు, నిన్ను భోజనానికి తీసుకు రమ్మన్నాడు' అన్నాడు. సర్లే మనకి ఈ చపాతీలు, రోటీలు మొహం మొత్తింది. హోమ్ ఫుడ్ తినొచ్చు అని వెళ్లాను. 10 రకాల వంటలు, అద్భుతమైన ఆతిథ్యం , ఎంత గొప్ప సినిమా సర్ అని వాళ్ల ఆవిడకి, పక్కింటి వాళ్లకి, గేట్ దగ్గర వాచ్ మాన్‌కి, కొరియర్ బాయ్‌కి, సార్‌తో సెల్ఫీ దిగండి, 'బేబీ సినిమా డైరెక్టర్' అని 30 ఫోటో లు ఇప్పించారు. ఒక గంట తర్వాత ప్లేట్లో గారెలు, నాటుకోడి పులుసు వడ్డించారు. 'మా అమ్మాయికి సమంత అంటే చాలా ఇష్టమండి, ఒక ఫొటో ఇప్పించండి, మళ్లీ ఎప్పడు చేస్తున్నారు ఆవిడతో' అని అన్నాడు. ఇంత జరిగినా గారెలు సిగ్గు లేకుండా లోపలకి వెళ్లిపోయినాయి. ఓ బేబీ' అని సాయి రాజేశ్ రాసుకొచ్చాడు.గతంలో సమంత ప్రధాన పాత్రలో 'ఓ బేబీ' అనే సినిమా వచ్చింది. 'బేబి' పేరుతో సాయి రాజేశ్ ఓ మూవీ తీశాడు. ఈ రెండింటి విషయంలో పొరబడ్డ డైరెక్టర్ ఫ్రెండ్ ఫ్రెండ్ సాయి రాజేశ్ పెద్ద షాకిచ్చాడు. అక్కడ ఏం చెప్పాలో తెలీక ఇలా ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి అందరినీ నవ్వించేస్తున్నాడు. ఏదేమైనా 'బేబి' పేరు ఎంత పనిచేసింది!(ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్'... ఆ వార్తలు నమ్మొద్దని టీమ్ ప్రకటన) View this post on Instagram A post shared by Sai Rajesh (@sairazesh) -
'బేబీ' దర్శక, నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు
బేబీ సినిమా కథ నాదేనంటూ హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులకు షార్ట్ ఫిలిం డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ శిరిన్ శ్రీరామ్ ఫిర్యాదు చేశాడు. గతేడాదిలో ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్ చిత్రంగా 'బేబీ' సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రాన్ని సాయి రాజేశ్ దర్శకత్వం వహిస్తే ఎస్కేఎన్ నిర్మాతగా తెరకెక్కించారు. (ఇదీ చదవండి : వీధి పోకిరి చెంప చెళ్లు మనిపించా: టాప్ హీరోయిన్) ఈ సినిమా కథను కొన్నేళ్ల క్రితమే డైరెక్టర్ సాయి రాజేశ్‌కు తాను చెప్పానంటూ శిరిన్ శ్రీరామ్ తాజాగా తెలుపుతున్నాడు. వారు కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు. 2013లో తన సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయాలని డైరెక్టర్ సాయిరాజేశ్ కోరినట్లు శ్రీరామ్ తెలిపాడు. అలా ఆయనతో పరిచయం ఏర్పడినట్లు ఆయన తెలుపుతున్నాడు. పోలీసులు చెబుతున్న ప్రకారం. ' 2015లో 'కన్నా ప్లీజ్' టైటిల్‌తో శ్రీరామ్ ఒక కథ రాసుకున్నాడు. ఆ కథకు 'ప్రేమించొద్దు' అని టైటిల్ పెట్టుకున్నారు. డైరెక్టర్ సాయి రాజేశ్ సూచనతో నిర్మాత శ్రీనివాసకుమార నాయుడు (SKN)కు కథ చెప్పాడు. ఇదే కథను కొన్నేళ్ల తర్వాత అంటే 2023లో 'బేబీ' టైటిల్‌తో సినిమా తెరకెక్కించారు. సాయి రాజేశ్ డైరెక్టర్‌గా ఎస్కేఎన్, ధీరజ్ మొగిలినేని సహ నిర్మాతలుగా బేబీ చిత్రాన్ని తీశారు. ఈ కథ మొత్తం తన 'ప్రేమించొద్దు' స్టోరీనే అని శిరిన్ శ్రీరామ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు కేసు నమోదు చేశారు. -
హీరో విశ్వక్ సేన్‌తో గొడవపై 'బేబీ' డైరెక్టర్ క్లారిటీ!
Baby Director Vishwak Sen Issue: తెలుగులో ఈ మధ్య కాలంలో సెన్సేషన్ సృష్టించిన సినిమా అంటే అందరూ 'బేబీ' పేరు చెబుతారు. అంచనాల్లేకుండా, పెద్ద స్టార్స్ లేకుండా రిలీజ్ అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. పెట్టుబడికి ఐదారు రెట్ల లాభాల మేర వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఓవైపు పాజిటివ్‌గా ఉన్నప్పటికీ.. మరోవైపు 'బేబీ' డైరెక్టర్-హీరో విశ్వక్ సేన్ వివాదం ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారిపోయింది. గొడవ ఏంటి? 'బేబీ' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఓ విషయం బయటపడింది. ఓ హీరోకి ఈ కథ చెప్పాలని చూస్తే కనీసం వినను కూడా వినలేదని అన్నాడట. ఇది జరిగిన కొన్నాళ్లకు విశ్వక్ సేన్ ఓ ట్వీట్ పెట్టాడు. దీన్ని ఉద్దేశిస్తూ బేబీ డైరెక్టర్ ఓ ట్వీట్ పెట్టాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఓ ఈవెంట్లో హీరో విశ్వక్ బరస్ట్ అయిపోయాడు. కొన్నిసార్లు నో చెప్పాల్సి వస్తుందని అన్నాడు. ఇప్పుడు ఈ విషయాలన్నింటిపై దర్శకుడు సాయి రాజేశ్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: సమంత ట్రీట్మెంట్ కోసం అన్ని కోట్ల ఖర్చు?) అది నాకు నచ్చలేదు 'విశ్వక్ సేన్‌కు 'బేబీ' కథ వినిపించాలని అనుకున్నది నిజమే. కానీ అతడు వినలేదు. దీనికి కారణం ఏంటో కూడా నాకు తెలియదు. బహుశా అతడి ప్రయారిటీ డైరెక్టర్స్ లిస్టులో నేను లేకపోయి ఉండొచ్చు. మిగతా విషయాలన్నీ పక్కనబెడితే విశ్వక్.. బేబీ మూవీకి నో చెప్పిన విధానం నాకు నచ్చలేదు. తను నో చెప్పిన సినిమా హిట్ అయింది. ఆ హిట్‌ని ఎంజాయ్ చేయాలి కానీ ఎదుటివారిని అవమానించొద్దని విశ్వక్ సేన్ అనేసరికి చాలా బాధపడ్డా' అని సాయి రాజేశ్ చెప్పాడు. విశ్వక్పై కోపం లేదు 'అయితే బేబీ రిజెక్ట్ చేశాడని అన్నాను గానీ ఎక్కడ అతడి పేరు చెప్పలేదు. అయితే హీరోల రిజెక్షన్ రెస్పెక్టబుల్‌గా ఉండే బాగుటుందనేది నా అభిప్రాయం. ఈ విషయంలో విశ్వక్పై నాకు ఎలాంటి కోపం లేదు. ఎందుకంటే అతడి ఫస్ట్ మూవీ 'వెళ్లిపోమాకే' రిలీజ్ కావడానికి నేను ఎంతో కష్టపడ్డాను. అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి వాళ్లకు చూపించి, అది రిలీజ్ చేయించాను' అని సాయి రాజేశ్ అప్పటి విషయాల్ని గుర్తుచేసుకుని మరీ క్లారిటీ ఇచ్చారు. (ఇదీ చదవండి: అతడితో డేటింగ్ వల్ల బరువు తగ్గాను: రాశీఖన్నా) -
Sai Rajesh Vs Vishwak Sen:విశ్వక్ సేన్ ఘాటు ట్వీట్.. బేబి డైరెక్టర్‌కు కౌంటర్?
టాలీవుడ్లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు విశ్వక్ సేన్. ఆ మధ్య అర్జున్ సర్జా దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఒప్పుకుని ఆ తర్వాత తూచ్ అంటూ చిత్రం నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడికి కమిట్మెంట్ లేదని అర్జున్ ఫైర్ అవగా చివరికి సారీ చెప్పి వివాదాన్ని సద్దుమణిగేలా చేశాడు. కొంతకాలంగా సైలెంట్ అయిపోయిన విశ్వక్ తాజాగా ఓ సెటైర్ వేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా.. అది దుమ్ముదుమారం రేపుతోంది. కుదరదంటే కుదరదంతే.. అరవకండి ముందుగా ఉన్నట్లుండి నవ్వుతున్న ఎమోజీని ట్విటర్లో షేర్ చేశాడు హీరో. సందర్భం ఏంటో చెప్పకుండా ఇలా నవ్విన ఎమోజీ షేర్ చేయడంతో అభిమానులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కాస్త ఏం జరిగిందో చెప్తే తాము కూడా నవ్వి సంతోషిస్తామని కామెంట్లు చేశారు. తర్వాత కాసేపటికి 'నో అంటే నో అంతే! ఇది మగవాళ్లకు కూడా వర్తిస్తుంది. కాబట్టి అరవడం మానేయండి, కాస్త ప్రశాంతంగా ఉండండి. మనందరం ప్రశాంత వాతావరణంలో ఉన్నాం. దాన్ని అలాగే ఉండనివ్వండి, విశ్రాంతి తీసుకోండి' అని మరో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూశాక నెటిజన్లు మరింత గందరగోళానికి లోనయ్యారు. అసలేమైందో చెప్పకుండా ఇదంతా ఏంటి? అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. బేబి డైరెక్టర్‌కు కౌంటర్? కొందరు మాత్రం బేబి డైరెక్టర్ సాయి రాజేశ్ గురించే విశ్వక్ ఈ ట్వీట్లు చేశాడని కామెంట్లు చేస్తున్నారు. 'అంటే బేబి సినిమాకు నో చెప్పిన హీరో నువ్వేనా? అయినా బేబికి నో చెప్పి మంచి పని చేశావులే, అది నీకు సెట్టవదు..' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా బేబి సినిమాను మొదట ఓ హీరోకు చెప్తే తిరస్కరించాడని సాయి రాజేశ్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. కనీసం కథ కూడా వినకుండానే రిజెక్ట్ చేశాడని, ఆ రాత్రంతా బాధతో తాను సరిగా నిద్ర కూడా పోలేదని పేర్కొన్నాడు. ఇప్పుడు విశ్వక్ ట్వీట్‌తో ఆ హీరో విశ్వక్ సేనేనని నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. "No means no" applies to men as well, so let's keep it cool and refrain from shouting. We're all about that peaceful vibe here, so let's just relax. ✌️ — VishwakSen (@VishwakSenActor) July 20, 2023 😂 — VishwakSen (@VishwakSenActor) July 20, 2023 చదవండి: చిన్నతనంలోనే నాన్న మరణం.. పెళ్లైన 10 ఏళ్లకు భార్యతో విడాకులు.. మ్యూజిక్ డైరెక్టర్ -
'బేబీ' సినిమా.. ఆ దర్శకుడి రియల్ ప్రేమకథేనా?
Baby Movie Director Details: ప్రస్తుతం ఎవరిని కదిపినా డిస్కషన్ అంతా 'బేబీ' గురించే. ఎందుకంటే రియలస్టిక్ లవ్‌స్టోరీతో తీసిన ఓ సినిమా థియేటర్లలోకి వచ్చి చాలా కాలమైపోయింది. సరిగ్గా ఈ పాయింట్‌నే క్యాష్ చేసుకున్న 'బేబీ'.. యూత్‌కి పిచ్చిపిచ్చిగా ఎక్కేసింది. అయితే ఈ సినిమా చూసిన చాలామంది ఇది దర్శకుడి రియల్ లైఫ్ ప్రేమకథేనా అని సందేహపడ్డారు. ఇప్పుడు ఆ ప్రశలన్నింటిపై స్వయంగా ఆ డైరెక్టరే క్లారిటీ ఇచ్చేశాడు. తెలిసిన కథే 'బేబీ' సినిమాలోని కథ కొత్తదేం కాదు. బస్తీలో పెరిగిన ఓ అమ్మాయి, తన ఇంటికి ఎదురుగా ఉన్న అబ్బాయిని స్కూల్లో ఉన్నప్పుడు లవ్ చేస్తుంది. కాలేజీలో అడుగుపెట్టిన తర్వాత మరో అబ్బాయితో రిలేషన్ లోకి వెళ్తుంది. ఏకంగా ఆ విషయంలో అడ్వాన్స్ అవుతుంది. ఇది మొదటి బాయ్ ఫ్రెండ్‌కి తెలిసిపోతుంది. దీంతో గొడవ జరుగుతుంది. చివరకు ఏమైందనేది అసలు స్టోరీ. రోజూ పేపర్, న్యూస్‌లో చదివే వార్తలానే ఈ సినిమా స్టోరీ ఉన్నట్లు చాలామందికి అనిపించింది. (ఇదీ చదవండి: 'బేబీ' కలెక్షన్స్.. మూడో రోజుకే అన్ని కోట్ల లాభాలతో!) అదే కారణం 'బేబీ' సక్సెస్ మీట్ ఆదివారం నిర్వహించగా అందులో దర్శకుడు సాయి రాజేశ్‌కు.. అసలు ఈ సినిమాకు ప్రేరణ ఏంటనే ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ.. '20 ఏళ్ల క్రితం నేను లవ్ చేశాను. ఓ 8 నెలలపాటు చాలా బాధ, కఠినమైన పరిస్థితులు అనుభవించాను. ఇది జరిగి చాలా కాలమైపోయినప్పటికీ ఆ బాధ అలానే ఉండిపోయింది. దాన్ని స్క్రీన్‌పై చూపిద్దామనే ఆలోచనతోనే ఈ స్టోరీ రాసుకున్నాను' అని చెప్పుకొచ్చారు. ఈ స్టోరీ నాది కాదు 'బేబీ'లో ఆనంద్ దేవరకొండ పాత్ర మీదేనా అనే ప్రశ్నకు డైరెక్టర్ సాయి రాజేశ్ సమాధానమిచ్చారు. 'ఆనంద్ పాత్ర నేను కాదు. ఎందుకంటే ప్రేమించిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకున్నాను. నా ఫస్ట్ లవ్ నా భార్యనే. కాకపోతే లవ్‌లో ఉన్నప్పుడు 8 నెలలు బాధ అనుభవించాను. ఆమెని ఎక్కడో దాచిపెట్టారు. ఎక్కడుందో తెలియకపోయేసరికి తెగ ఇబ్బంది పడ్డాను. ప్రేమలో నేను సక్సెస్ అయినా.. నా పిల్లలు ఎక్కడ లవ్ చేస్తారో అనే భయముంది. వాళ్లు నాలా బాధపడకూడదనే ఫీలింగ్ లోలోపల ఉంటుంది. ఇదంతా నేను స్క్రీన్‌పై చూపించాను' అని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: లిప్‌లాక్,బోల్డ్ సీన్స్‌పై మా ఇంట్లో ఏమన్నారంటే: బేబీ హీరోయిన్) -
అందరికీ కనెక్ట్ అయ్యే కథ
‘‘నా సొంత అనుభవాల నుంచి నేను తయారు చేసుకున్న కథే ‘కలర్ ఫొటో’. 1990 – 97 ప్రాంతంలో జరిగిన ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇంటర్నెట్ లేని టైమ్‌లో ప్రేమలు ఎలా ఉన్నాయి? అనే అంశాన్ని ఈ సినిమాలో చెప్పాం’’ అని నిర్మాత సాయి రాజేష్ నీలం అన్నారు. హాస్యనటుడు సుహాస్ హీరోగా, చాందీని చౌదరి హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘కలర్ ఫొటో’. సునీల్, వైవా హర్ష కీలక పాత్రల్లో నటించారు. సందీప్ దర్శకత్వం వహించారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని, అమృత ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రవణ్ కొంక నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న ‘ఆహా’ ఓటీటీలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాయిరాజేష్ నీలం మాట్లాడుతూ– ‘‘గతంలో నిర్మించిన ‘హృదయ కాలేయం, కొబ్బరిమట్ట’ రెండూ కమర్షియల్ హిట్స్ అయినప్పటికీ, మా బ్యానర్‌కి రావాల్సిన గౌరవం రాలేదనుకుని, ‘కలర్ ఫొటో’ నిర్మించాను. ఈ చిత్రం టీజర్‌తోనే నాకు, నా బ్యానర్‌కి మంచి గుర్తింపు, గౌరవం వచ్చాయి. రంగు వివక్ష గురించి ఈ సినిమాలో నిజాయతీగా చెప్పడానికి ప్రయత్నించాం. అలా అని ఇదేదో సీరియస్ సబ్జెక్ట్ కాదు.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం, భావోద్వేగాలుంటాయి. ఈ కథకి తగిన హీరోగా సుహాస్ సూట్ అవుతాడని తీసుకున్నాం. సునీల్‌గారు ఈ సినిమాలో హీరోయిన్ అన్న పాత్రలో ఒక పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. కాలభైరవ సంగీతం ఓ ప్లస్ పాయింట్’’ అన్నారు. -
'హృదయ కాలేయం' మూవీ స్టిల్స్