Vishwak Sen Vs Sai Rajesh Neelam: Vishwak Sen Tweet Against Baby Movie Director Sai Rajesh? - Sakshi
Sakshi News home page

Sai Rajesh Neelam Vs Vishwak Sen: 'నో అంటే నో.. అంతే! మగాళ్లకు కూడా వర్తిస్తుంది'.. సడన్‌గా ఈ పోస్ట్‌ ఏంది? ఈ గందరగోళమేంది సామీ!

Published Fri, Jul 21 2023 1:29 PM | Last Updated on Fri, Jul 21 2023 2:29 PM

Sai Rajesh Neelam VS Vishwak Sen: Vishwak Sen Tweet Against Director Sai Rajesh? - Sakshi

టాలీవుడ్‌లో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడు విశ్వక్‌ సేన్‌. ఆ మధ్య అర్జున్‌ సర్జా దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఒప్పుకుని ఆ తర్వాత తూచ్‌ అంటూ చిత్రం నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడికి కమిట్‌మెంట్‌ లేదని అర్జున్‌ ఫైర్‌ అవగా చివరికి సారీ చెప్పి వివాదాన్ని సద్దుమణిగేలా చేశాడు. కొంతకాలంగా సైలెంట్‌ అయిపోయిన విశ్వక్‌ తాజాగా ఓ సెటైర్‌ వేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టగా.. అది దుమ్ముదుమారం రేపుతోంది.

కుదరదంటే కుదరదంతే.. అరవకండి
ముందుగా ఉన్నట్లుండి నవ్వుతున్న ఎమోజీని ట్విటర్‌లో షేర్‌ చేశాడు హీరో. సందర్భం ఏంటో చెప్పకుండా ఇలా నవ్విన ఎమోజీ షేర్‌ చేయడంతో అభిమానులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కాస్త ఏం జరిగిందో చెప్తే తాము కూడా నవ్వి సంతోషిస్తామని కామెంట్లు చేశారు. తర్వాత కాసేపటికి 'నో అంటే నో అంతే! ఇది మగవాళ్లకు కూడా వర్తిస్తుంది. కాబట్టి అరవడం మానేయండి, కాస్త ప్రశాంతంగా ఉండండి. మనందరం ప్రశాంత వాతావరణంలో ఉన్నాం. దాన్ని అలాగే ఉండనివ్వండి, విశ్రాంతి తీసుకోండి' అని మరో ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ చూశాక నెటిజన్లు మరింత గందరగోళానికి లోనయ్యారు. అసలేమైందో చెప్పకుండా ఇదంతా ఏంటి? అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

బేబి డైరెక్టర్‌కు కౌంటర్‌?
కొందరు మాత్రం బేబి డైరెక్టర్‌ సాయి రాజేశ్‌ గురించే విశ్వక్‌ ఈ ట్వీట్లు చేశాడని కామెంట్లు చేస్తున్నారు. 'అంటే బేబి సినిమాకు నో చెప్పిన హీరో నువ్వేనా? అయినా బేబికి నో చెప్పి మంచి పని చేశావులే, అది నీకు సెట్టవదు..' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా బేబి సినిమాను మొదట ఓ హీరోకు చెప్తే తిరస్కరించాడని సాయి రాజేశ్‌ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. కనీసం కథ కూడా వినకుండానే రిజెక్ట్‌ చేశాడని, ఆ రాత్రంతా బాధతో తాను సరిగా నిద్ర కూడా పోలేదని పేర్కొన్నాడు. ఇప్పుడు విశ్వక్‌ ట్వీట్‌తో ఆ హీరో విశ్వక్‌ సేనేనని నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది.

చదవండి: చిన్నతనంలోనే నాన్న మరణం.. పెళ్లైన 10 ఏళ్లకు భార్యతో విడాకులు.. మ్యూజిక్‌ డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement