Baby Movie Director Latest Interview Clarify Vishwak Sen Issue - Sakshi
Sakshi News home page

Baby Director: విశ్వక్‌పై నాకు కోపం లేదు.. కానీ!

Published Wed, Aug 2 2023 8:07 AM | Last Updated on Wed, Aug 2 2023 8:23 AM

Baby Director Latest Interview Clarify Vishwak Sen Issue - Sakshi

Baby Director Vishwak Sen Issue: తెలుగులో ఈ మధ్య కాలంలో సెన్సేషన్ సృష్టించిన సినిమా అంటే అందరూ 'బేబీ' పేరు చెబుతారు. అంచనాల్లేకుండా, పెద్ద స్టార్స్ లేకుండా రిలీజ్ అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. పెట్టుబడికి ఐదారు రెట్ల లాభాల మేర వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఓవైపు పాజిటివ్‌గా ఉన్నప్పటికీ.. మరోవైపు 'బేబీ' డైరెక్టర్-హీరో విశ్వక్ సేన్ వివాదం ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారిపోయింది.

గొడవ ఏంటి?
'బేబీ' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఓ విషయం బయటపడింది. ఓ హీరోకి ఈ కథ చెప్పాలని చూస్తే కనీసం వినను కూడా వినలేదని అన్నాడట. ఇది జరిగిన కొన్నాళ్లకు విశ్వక్ సేన్ ఓ ట్వీట్ పెట్టాడు. దీన్ని ఉద్దేశిస్తూ బేబీ డైరెక్టర్ ఓ ట్వీట్ పెట్టాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఓ ఈవెంట్‌లో హీరో విశ్వక్ బరస్ట్ అయిపోయాడు. కొన్నిసార్లు నో చెప్పాల్సి వస్తుందని అన్నాడు. ఇప్పుడు ఈ విషయాలన్నింటిపై దర్శకుడు సాయి రాజేశ్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాడు.

(ఇదీ చదవండి: సమంత ట్రీట్‌మెంట్ కోసం అన్ని కోట్ల ఖర్చు?)

అది నాకు నచ్చలేదు
'విశ్వక్ సేన్‌కు 'బేబీ' కథ వినిపించాలని అనుకున్నది నిజమే. కానీ అతడు వినలేదు. దీనికి కారణం ఏంటో కూడా నాకు తెలియదు. బహుశా అతడి ప‍్రయారిటీ డైరెక్టర్స్ లిస్టులో నేను లేకపోయి ఉండొచ్చు. మిగతా విషయాలన్నీ పక్కనబెడితే విశ్వక్.. బేబీ మూవీకి నో చెప్పిన విధానం నాకు నచ్చలేదు. తను నో చెప‍్పిన సినిమా హిట్ అయింది. ఆ హిట్‌ని ఎంజాయ్ చేయాలి కానీ ఎదుటివారిని అవమానించొద్దని విశ్వక్ సేన్ అనేసరికి చాలా బాధపడ్డా' అని సాయి రాజేశ్ చెప్పాడు.

విశ్వక్‌పై కోపం లేదు
'అయితే బేబీ రిజెక్ట్ చేశాడని అన్నాను గానీ ఎక్కడ అతడి పేరు చెప్పలేదు. అయితే హీరోల రిజెక్షన్ రెస్పెక్టబుల్‌గా ఉండే బాగుటుందనేది నా అభిప్రాయం. ఈ విషయంలో విశ్వక్‌పై నాకు ఎలాంటి కోపం లేదు. ఎందుకంటే అతడి ఫస్ట్ మూవీ 'వెళ్లిపోమాకే' రిలీజ్ కావడానికి నేను ఎంతో కష్టపడ్డాను. అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి వాళ్లకు చూపించి, అది రిలీజ్ చేయించాను' అని సాయి రాజేశ్ అప్పటి విషయాల్ని గుర్తుచేసుకుని మరీ క్లారిటీ ఇచ్చారు. 

(ఇదీ చదవండి: అతడితో డేటింగ్ వల్ల బరువు తగ్గాను: రాశీఖన్నా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement