ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'బేబి'. హృదయ కాలేయం ఫేం సాయిరాజేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్న ఆమె ఈ సినిమాతో హీరోయిన్‌గా డెబ్యూ ఇవ్వనుంది. ఇందులో వైష్ణవి డీ గ్లామర్ రోల్ పోషించింది.
ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. పాటలు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ప్రేమిస్తున్నా అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
ప్రేమిస్తున్నా.. ప్రేమిస్తున్నా, నీ ప్రేమలో జీవిస్తున్నా అంటూ సాగే ఈ పాటకు బానిశెట్టి సాహిత్యాన్ని అందించగా, రోహిత్ ఆలపించాడు. ఈ సాంగ్‌ను నేషనల్ క్రష్ రష్మిక తన చేతుల మీదుగా రిలీజ్ చేసింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment