ఆనంద్‌ దేవరకొండ 'బేబీ' డబ్బింగ్‌ షురూ | Anand Devarakonda Baby Movie Dubbing Work Started | Sakshi
Sakshi News home page

Anand Devarakonda : ఆనంద్‌ దేవరకొండ 'బేబీ' డబ్బింగ్‌ షురూ

Published Sat, Aug 13 2022 10:13 AM | Last Updated on Sat, Aug 13 2022 10:14 AM

Anand Devarakonda Baby Movie Dubbing Work Started - Sakshi

ఆనంద్‌ దేవరకొండ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విరాజ్‌ అశ్విన్, వైష్ణవి చైతన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్‌కేఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డబ్బింగ్‌ కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘న్యూ ఏజ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రం ‘బేబీ’. చిత్రీకరణ తుది దశలో ఉంది.

పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా మొదలుపెట్టాం. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాల్‌ రెడ్డి, సంగీతం: విజయ్‌ బుల్గానిన్, సహనిర్మాత: ధీరజ్‌ మొగిలినేని, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: దాసరి వెంకట సతీష్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement