Do You Know About This Girl Who Acted As Vaishnavi Chaitanya Friend In Baby Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Who Is Baby Movie Friend Role Kusuma: హీరోయిన్‌​ వైష్ణవి పక్కన నటించిన ఈ 'బేబీ' రియల్‌ ఫోటో చూస్తే..

Published Tue, Jul 18 2023 1:03 PM | Last Updated on Tue, Jul 18 2023 2:59 PM

Vaishnavi Chaitanya Baby Movie Friend Kusuma Details - Sakshi

తెలుగు రాష్ట్రాల్లో 'బేబీ' సినిమా మానియా ఏ మాత్రం తగ్గడం లేదు. సాధారణంగా సినిమా బాగుంటేనే వీకెండ్‌లో థియేటర్లు ఫుల్‌ అవడం అంతంతమాత్రమే.. అలాంటిది ఈ కల్ట్‌ లవ్‌ స్టోరీ సినిమా దెబ్బ యూత్‌ గుండెలపైన డైరెక్ట్‌గా కొట్టడంతో సోమవారం కూడా థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్‌ బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చింది.  అంతేకాకుండా ఈ సినిమా విజయంతో చాలా మంది లైమ్‌లైట్‌లోకి వచ్చారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి ఇండియన్‌ స్టార్‌ క్రికెటర్‌ ఎంట్రీ.. స్టార్‌ మా ప్లాన్‌ ఇదేనా?)

ముఖ్యంగా హీరోయిన్‌ వైష్ణవి చైతన్య,విరాజ్‌ అశ్విన్‌,మ్యూజిక్‌ డైరెక్టర్‌ విజయ్ బుల్గానిన్‌లకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటికే పలు సినిమాలతో ఇండస్ట్రీలో ఉన్న హీరో ఆనంద్‌ దేవరకొండ, నిర్మాత ఎస్‌కేఎన్‌, డైరెక్టర్‌ సాయి రాజేశ్‌లకు మరింత స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టింది. ఇలా వీరందరికీ బేబీ సినిమా ఊహించలనేంత పేరును తీసుకొచ్చింది.

కానీ అందరూ ఆ బేబీ (వైష్ణవి) గురించే కాకుండా హీరోయిన్‌ పక్కన నటించిన మరో అమ్మాయి గురించి కూడా ఇంటర్నెట్‌లో నెటిజన్లు వెతుకుతున్నారు. ఇంతకు ఆమె పేరే 'కుసుమ డేగలమర్రి'. తనకు ఇదే మొదటి సినిమా కానీ.. ఇప్పటికే  యూట్యూబ్‌ కోసం పలు షార్ట్‌ ఫిలిమ్స్‌లో కుసుమ నటించింది. అందులో ఆర్య-3 ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగానే ఫాలోవర్స్‌ ఉన్నారు.

మొదట సోషల్ మీడియా ద్వారానే వారి టాలెంట్‌ చూపించుకుని తర్వాత సినిమాల్లోకి వచ్చి ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు కుసుమ కూడా అదే బాటలో పయనిస్తుంది. తనకు అందంతో పాటు టాలెంట్‌లో కూడా ఏ మాత్రం తీసిపోని కుసుమ సినిమాల్లో మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. బేబీ సినిమాలో పల్లెటూరి పిల్లాల నటించిన కుసుమ ట్రెండీ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. బేబీ సినిమా తెచ్చిన ఫేమ్‌తో తనకు మరిన్ని సినిమా అవకాశాలు రానున్నాయని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: విడాకుల బాటలో కలర్స్ స్వాతి.. నిహారిక,సమంత మాదిరే క్లూ ఇచ్చేసిందంటూ..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement