
‘ఎదురుగా ఇంతందంగా కనిపిస్తుంటే నీ చిరునవ్వూ.. ఎదసడే హద్దులు దాటె చూడు చూడు చూడు...’ అంటూ మొదలవుతుంది ‘బేబీ’ చిత్రంలోని ‘రిబపప్పా రిబపప్పాప..’ సాంగ్. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ ‘బేబీ’.
సాయిరాజేష్ దర్శకత్వంలో ఎస్‌కేఎన్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘రిబపప్పా రిబపప్పాప..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను చిత్రయూనిట్ సోమవారం విడుదల చేసింది. సురేశ్ బనిశెట్టి సాహిత్యం అందించిన ఈ పాటను సాయి కృష్ణ పాడారు. ఈ సినిమాకు సహ నిర్మాత: ధీరజ్ మొగిలినేని.