![Baby Movie Actors Anand And Vaishnavi Chaitanya Remuneration - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/22/babny.jpg.webp?itok=dLyvwdSe)
ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్యను ప్రధానంగా చూపిస్తూ దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన సినిమా ‘బేబీ’. విరాజ్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాకు ఎస్‌కేఎన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ‘మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అంటూ రూపొందిన ఈ మూవీ యువతకు బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి ఈ సినిమాలో తన నటనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.
(ఇదీ చదవండి: Hatya Review: ‘హత్య’ మూవీ రివ్యూ)
ఆమె నటనకు యూత్ ఎంతగా కనెక్ట్ అయ్యారంటే.. సినిమా చూసిన వారు సినిమాలోని ఆమె పాత్రను అంత దారుణంగా తిడుతుంటే. ఆనంద్ దేవరకొండ తన అద్భుతమైన నటనతో కన్నీళ్లు తెప్పించాడు. వారిద్దరికీ ఏ మాత్రం తగ్గకుండా విరాజ్ అశ్విన్ కూడా మెప్పించాడు. ఇంతలా ఆకట్టుకున్న వీరందరికి ఇచ్చిన రెమ్యునరేషన్ ఇంత తక్కువనా..? అంటూ నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు.
సుమారు రూ. 10 కోట్ల బడ్జెట్‌తో బేబీ సినిమాను తెరకెక్కించారని టాక్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు ఎవరూ ఊహించని విధంగా ఇప్పటికే రూ. 50కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కానీ ఇందులో లీడ్ రోల్ చేసిన ఆనంద్ దేవరకొండకు సుమారు రూ.80 లక్షల వరకు పారితోషికం ఇచ్చారని ప్రచారం జరుగుతుండగా.. యూత్ గుండెలపై బలంగా తన మార్క్‌ను వేసిన హీరోయిన వైష్ణవికి కేవలం రూ.30 లక్షలు రెమ్యునరేషన్‌గా ఇచ్చారని టాక్. విరాజ్ అశ్విన్‌కు రూ.20 లక్షలు ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దర్శకుడు సాయి రాజేష్ మాత్రం కోటికి పైగా తీసుకున్నాడని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: HER: Chapter 1 Movie Review - ‘హర్’ మూవీ రివ్యూ)
ముఖ్యంగా ఇందులో వైష్ణవి ఫైనాన్సియల్‌గా కూడా చాలా ఇబ్బందులు పడిందని డైరెక్టర్ సాయి రాజేష్ సినిమా ప్రమోషన్స్ టైమ్‌లో చెప్పాడు. దీంతో సినిమా బజ్ తగ్గాక మరికొంత రెమ్యునరేషన్‌గా వైష్ణవికి ఇవ్వచ్చని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ విషయం కాస్త పక్కనపెడితే తను ఇదే సంస్థతో మరో రెండు సినిమాలు చేయనున్నది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు కూడా. మరోవైపు గీతా ఆర్ట్స్‌లో కూడా ఓ సినిమా ఛాన్స్ రానున్నదని టాక్.
Comments
Please login to add a commentAdd a comment