Buzz: Vaishnavi Chaitanya To Act With Ram Pothineni In Double Ismart Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Vaishnavi Chaitanya: బేబీకి అదిరిపోయే ఆఫర్‌.. ఆ యంగ్‌ హీరోతో జోడీ కట్టనున్న వైష్ణవి!

Published Thu, Aug 3 2023 5:05 PM | Last Updated on Thu, Aug 3 2023 6:05 PM

Buzz: Vaishnavi Chaitanya to Act with Ram Pothineni in Double Ismart - Sakshi

వైష్ణవి చైతన్య.. యూట్యూబ్‌లో పలు షార్ట్‌ ఫిలింస్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె నటించిన సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌ వెబ్‌ సిరీస్‌ ఆమెకు ఎక్కడలేని క్రేజ్‌ తెచ్చిపెట్టింది. నెమ్మదిగా వెండితెరపైనా అడుగుపెట్టింది. అల వైకుంఠపురములో చిత్రంలో అల్లు అర్జున్‌ చెల్లిగా నటించింది. ఇలా చిన్న పాత్రలు చేస్తున్న సమయంలో అదృష్టం డైరెక్టర్‌ సాయి రాజేశ్‌ రూపంలో ఆమె తలుపు తట్టింది. అతడు బేబీ సినిమా కథ వినిపించాడు.

భయంతో నో చెప్పిన బ్యూటీ
జనాలు తన పాత్రను ఎలా రిసీవ్‌ చేసుకుంటారోనన్న భయంతో మొదట చేయనని చెప్పేసింది వైష్ణవి. అప్పుడు సాయిరాజేశ్‌ ఆమె పాత్ర గురించి సవివరంగా చెప్పి ధైర్యం నూరిపోయడంతో ఆయనపై నమ్మకం పెట్టుకుని సినిమా ఓకే చేసింది. ఇంట్లో వాళ్ల అంగీకారం తీసుకున్న తర్వాతే బెడ్‌రూమ్‌ సీన్స్‌లో నటించింది వైస్ణవి. చివరకు తన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. బేబీ ఎవరూ ఊహించనంత విజయం సాధించింది. హీరోయిన్‌గా తొలి సినిమా సక్సెస్‌ కావడంతో వైష్ణవి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

రామ్‌ పోతినేనికి జోడీగా
ఇకపోతే గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో వైష్ణవి ఓ సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ బేబీ మరో బంపర్‌ ఆఫర్‌ చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని సరసన నటించే ఛాన్స్‌ కొట్టేసినట్లు ఓ వార్త ఫిల్మీదునియాలో వైరల్‌గా మారింది. పూరీ జగన్నాథ్‌.. రామ్‌తో కలిసి ఇస్మార్ట్‌ శంకర్‌కు సీక్వెల్‌గా డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా వైష్ణవి చైతన్యను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

బేబీని పొగిడిన రామ్‌
బేబీ సినిమాలో ఆమె నటన చూసి పూరీ ఫిదా అయ్యాడని, అందుకే వెంటనే తనకు డబుల్‌ ఇస్మార్ట్‌లో ఛాన్స్‌ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే రామ్‌ పోతినేని కూడా వైష్ణవిని మెచ్చుకుంటూ తనకు పుష్పగుచ్ఛాన్ని పంపించాడు. ఈ మూవీలో బేబీ ఉంటే తన దశ తిరగడం ఖాయమని నెటిజన్లు భావిస్తున్నారు. ఇకపోతే డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమాను పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మి​ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వచ్చే ఏడాది మార్చి 8న డబుల్‌ ఇస్మార్ట్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ఇటీవలే వెల్లడించింది.

చదవండి: సినిమాల్లోకి పబ్జీ వీర ప్రేయసి.. భర్తను వదిలి  ప్రియుడు కోసం ఇండియాకు వచ్చిన పాక్‌ మహిళ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement