
హీరో ఆనంద్ దేవరకొండ,విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటిస్తున్న తాజా సినిమా 'బేబీ. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్‌కేఎన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సాయి రాజేష్ నేషనల్ అవార్డ్ అందుకున్నారు. రీసెంట్‌గా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
తాజాగా 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా ' అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా.. విజయ్ బుల్గానిన్ స్వరపరిచారు. ఈ పాటను శ్రీరామ్ ఆలపించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు ప్రారంభించారు.